రమేష్ కు జాతీయ పురస్కారం - పర్యావరణ పరిరక్షణ లెజెండ్ పురస్కారానికి ఎంపిక

రమేష్ కు జాతీయ పురస్కారం పర్యావరణ పరిరక్షణ లెజెండ్ పురస్కారానికి ఎంపిక 17న త్యాగరాయ గాన సభలో అందజేత రాజన్న సిరిసిల్ల జిల్లా: పర్యావరణ పరిరక్షణ లెజెండ్ జాతీయ పురస్కారానికి దుంపెన రమేష్ ( Dumpena Ramesh ) ఎంపికయ్యారు.ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన దుంపెన రమేష్ మొక్కల సంరక్షకునిగా ఉంటూ మొక్కలను అనునిత్యం పంపిణీ చేస్తూ మొక్కల వల్ల కలిగే లాభాలను ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియపరుస్తూ పర్యావరణ పట్ల గత 12 ఏళ్ల నుంచి అవగాహన కల్పిస్తున్నారు.

 Ramesh Was Nominated For The National Award - Legend Award For Environmental Pro-TeluguStop.com

అదేవిధంగా సాహిత్యంలోనూ చిగురు, గుమ్మడిపూలు, తులసి,పుస్తకాలు రచించాడు.వాటిని తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో ఆవిష్కరించాడు.

తన సేవలను గుర్తించి తనకు ఈ అరుదైన పురస్కారం రావడం ఆనందంగా ఉందని దుంపెన రమేష్ పేర్కొన్నారు.ఈ పురస్కారాన్ని ఈనెల 17న హైదరాబాద్ త్యాగరాయ గాన సభలో తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా సాహితీ వేదిక స్వచ్ఛంద సంస్థ వారు పురస్కారం అందజేస్తున్నారని తెలిపారు.

ఈ సందర్భంగాఎల్లారెడ్డిపేట వైద్యులు డాక్టర్ సత్యనారాయణ స్వామి, డాక్టర్ వాసర వేణి పరుశురాం, టిఆర్ఎస్ పట్టణ శాఖ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి, డాక్టర్ జానపల శంకరయ్య, ఎలగొండ రవి,వెంగళ లక్ష్మణ్,ఆడెపు లక్ష్మణ్, తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube