రమేష్ కు జాతీయ పురస్కారం – పర్యావరణ పరిరక్షణ లెజెండ్ పురస్కారానికి ఎంపిక

రమేష్ కు జాతీయ పురస్కారం పర్యావరణ పరిరక్షణ లెజెండ్ పురస్కారానికి ఎంపిక 17న త్యాగరాయ గాన సభలో అందజేత రాజన్న సిరిసిల్ల జిల్లా: పర్యావరణ పరిరక్షణ లెజెండ్ జాతీయ పురస్కారానికి దుంపెన రమేష్ ( Dumpena Ramesh ) ఎంపికయ్యారు.

ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన దుంపెన రమేష్ మొక్కల సంరక్షకునిగా ఉంటూ మొక్కలను అనునిత్యం పంపిణీ చేస్తూ మొక్కల వల్ల కలిగే లాభాలను ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియపరుస్తూ పర్యావరణ పట్ల గత 12 ఏళ్ల నుంచి అవగాహన కల్పిస్తున్నారు.

అదేవిధంగా సాహిత్యంలోనూ చిగురు, గుమ్మడిపూలు, తులసి,పుస్తకాలు రచించాడు.వాటిని తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో ఆవిష్కరించాడు.

తన సేవలను గుర్తించి తనకు ఈ అరుదైన పురస్కారం రావడం ఆనందంగా ఉందని దుంపెన రమేష్ పేర్కొన్నారు.

ఈ పురస్కారాన్ని ఈనెల 17న హైదరాబాద్ త్యాగరాయ గాన సభలో తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా సాహితీ వేదిక స్వచ్ఛంద సంస్థ వారు పురస్కారం అందజేస్తున్నారని తెలిపారు.

ఈ సందర్భంగాఎల్లారెడ్డిపేట వైద్యులు డాక్టర్ సత్యనారాయణ స్వామి, డాక్టర్ వాసర వేణి పరుశురాం, టిఆర్ఎస్ పట్టణ శాఖ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి, డాక్టర్ జానపల శంకరయ్య, ఎలగొండ రవి,వెంగళ లక్ష్మణ్,ఆడెపు లక్ష్మణ్, తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

వీడియో: రైల్వే ట్రాక్‌పై గొడుగు వేసుకుని దర్జాగా నిద్రపోయాడు.. ట్రైన్ రావడంతో..?