ఆరోగ్యకరమైన , పటిష్ట ఓటరు జాబితా తయారీకి కృషి చేయాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా :ఎలాంటి తప్పులకు ఆస్కారంలేని, ఆరోగ్యకరమైన , పటిష్ట ఓటరు జాబితా తయారీ కి కృషి చేయాలనీ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి( Anuraag Jayanti )అధికారులకు సూచించారు.సోమవారం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతిస్పెషల్ సమ్మరీ రివిజన్- 2023, రెండవ ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా ఎల్లారెడ్డిపేట మండలం పదిర, ఎల్లారెడ్డిపేట గ్రామాల్లో పర్యటించారు.

 Efforts Should Be Made To Prepare A Healthy And Strong Voter List Anuraag Jayant-TeluguStop.com

పదిర, ఎల్లారెడ్డి పేట( Yellaredd peta ) గ్రామాల్లోని ఏ ఏరియాలో ఓటరు జాబితా నుంచి ఎన్ని తొలగింపులు చేశారో అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఓటరు జాబితా( Voter list )లో మీ ఇంట్లో 18 సంవత్సరాలు నిండిన అందరి పేర్లు ఉన్నాయా?అంటూ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి క్షేత్ర స్థాయిలో ప్రజలను ప్రశ్నించారు.ఉన్నాయంటూ వారు సమాధానం ఇచ్చారు.మరణించిన వ్యక్తులను జాబితా నుంచి తొలగించిన నేపథ్యంలో ఆ వివరాలను క్షేత్ర స్థాయిలో సదరు ఇంటికీ వెళ్లి కుటుంబ సభ్యులతో ఆ విషయాన్ని క్రాస్ చెక్ చేసి రూఢి చేసుకున్నారు.

జాబితాలోని వివరాలు అన్ని సరిగ్గా ఉన్నట్లు తెలియడంతోయు హావ్ డన్ ఫెయిర్ జాబ్ అంటూ తహశీల్దార్ బి.రాంచందర్ ను జిల్లా కలెక్టర్ అభినందించారు.అక్టోబర్‌ 1, 2023 నాటికి 18 ఏళ్లు నిండిన వారంతా ఓటరు జాబితాలో ఉండేలా చూసుకోవాలన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube