సంక్రాంతి పండుగ సందర్భంగా బాలకృష్ణ ( Balakrishna ) గోపీచంద్ (Gopichand) మల్లినేని కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి వీర సింహారెడ్డి (Veerasimha Reddy ) సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే.ఈ సినిమా తరువాత బాలకృష్ణ తన తదుపరిచిత్రాన్ని అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్నారు.
ఈ సినిమాకు భగవంత్ కేసరి అనే టైటిల్ కూడా ఖరారు చేశారు.ఇక ఈ సినిమా షూటింగ్ పనులను పూర్తి చేసుకుందనే తెలుస్తుంది అక్టోబర్ 19వ తేదీ ఈ సినిమా విడుదల కానున్నటువంటి నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు.
</div
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైనటువంటి టీజర్( Bhagavanth Kesari ) వినాయక చవితి స్పెషల్ సాంగ్ ద్వారా ప్రేక్షకులలో భారీ స్థాయిలో అంచనాలు పెంచేశారు.అయితే ఈ సినిమాపై ఈ విధమైనటువంటి అంచనాలు ఉండి ఈ సినిమా మంచి సక్సెస్ కావాలి అంటే వెంట వెంటనే ఈ సినిమా గురించి అప్డేట్స్ విడుదల చేస్తూ ప్రమోషన్స్ చేపట్టాలని అభిమానులు భావిస్తున్నారు .అయితే అనిల్ రావిపూడి( Anil Ravipudi ) మాత్రం వినాయక చవితి స్పెషల్ సాంగ్ తర్వాత ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ ఇవ్వడానికి సిద్ధంగా లేరని తెలుస్తుంది.ఇలా కనుక ఆలస్యం చేస్తే ప్రేక్షకుల దృష్టి మరొక సినిమాపై పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
</div
ఈ క్రమంలోనే అనిల్ రావిపూడి ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని వెంటనే ఈ సినిమా నుంచి ఏదో ఒక సాంగ్ విడుదల చేయడం లేదా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ విడుదల చేస్తేనే ఈ సినిమాపై ప్రేక్షకుల దృష్టి మల్లుతుందని అప్పుడే ఈ సినిమా సక్సెస్ అవ్వడానికి ఎంత దోహదం పడుతుందని తెలుస్తుంది.ఈ సినిమా విడుదలకు మరో మూడు వారాల సమయం మాత్రమే ఉంది అయినప్పటికీ మేకర్స్ ఇంకా ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ విడుదల చేయకపోవడంతో అభిమానులు అసహనం వ్యక్తం చేయడమే కాకుండా ఈ సినిమా నుంచి త్వరగా ఏదో ఒక అప్డేట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.ఇప్పటికైనా అనిల్ రావిపూడి అండ్ టీం మేలుకొని ఈ సినిమా నుంచి బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ చేస్తేనే ప్రేక్షకులలో సినిమాపై హైప్ వస్తుందని చెప్పాలి.







