రాంగోపాల్ వర్మ… ఇప్పుడంటే ఏమో కొన్ని పిచ్చి ప్రయోగాలు చేస్తూ సినిమాలను బ్రష్టు పట్టిస్తున్నాడు అంటూ జనాలు ఆడిపోసుకుంటున్నారు కానీ ఒకప్పుడు ఆయన రేంజ్ వేరు.అమితాబచ్చన్ లాంటి స్టార్ హీరోలు సైతం ఆయనకు సలాం కొట్టాల్సిందే.
మరి అంతటి స్టార్ ఇమేజ్ ఉన్న దర్శకుడు ఇప్పుడెందుకు ఇలాంటి బూతు కథలు నమ్ముకొని సినిమాలు తీస్తున్నాడు అంటే దానికి మన దగ్గర సమాధానం ఉండదు.అయితే వర్మ గురించి బయట ప్రపంచానికి తెలియని ఒక సంఘటన గురించి మనం ఇప్పుడు ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
తెలుగు ఇండస్ట్రీలో స్టార్ దర్శకుడుగా ఉన్న రాంగోపాల్ వర్మ బాలీవుడ్ కి వెళ్లి తన టాలెంట్ ని చూపించి ఈ కొన్ని హిట్ సినిమాలు చేశాడు.అమితాబచ్చన్ తో సర్కార్ వంటి సినిమా చేసి తనేంటో హిందీ ప్రపంచానికి పరిచయం చేసుకున్నాడు.
ఇక సర్కారు సినిమా విజయవంతం కావడంతో ఆగ్ అని మరో సినిమా కూడా అమితాబ్ తో చేశాడు వర్మ.అలా సదాసీదాగా సినిమా తీస్తే అతడిని రాంగోపాల్ వర్మ ఎందుకంటారు చెప్పండి.
వర్మ తో ఒకరోజు షూటింగ్ సమయంలో అమితాబ్ కి జరిగిన సంఘటన తో ఆయన గొప్పతనం గురించి మనం తెలుసుకోవచ్చు.
అవి సినిమా ఇండస్ట్రీలో స్ట్రైక్స్ జరుగుతున్న రోజులు.

లైట్స్ డిపార్ట్మెంట్ అంతా కూడా స్ట్రైక్ చేస్తూ అన్ని సినిమా షూటింగ్ లని ఆపేశారు.అసలు ఆ విషయం తెలియని వర్మ అమితాబచ్చన్ తో భారీ షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నాడు.కానీ ఒకరోజు సినిమా ఆగితే ప్రొడ్యూసర్ ఎంతగా నష్టపోతాడో మనందరికీ తెలిసిందే దాంతో వర్మ బాగా ఆలోచించాడు.ప్రొడ్యూసర్స్ భయం తో వచ్చి వర్మకి స్ట్రైక్ జరుగుతున్న విషయం తెలుపగా నవ్వేసిన వర్మ లైట్స్ తో మనకు పని ఏంటి చెప్పండి అంటూ క్యాండిల్స్ పెట్టి సినిమా షూటింగ్ నీ పూర్తి చేశాడు.
షూటింగ్ అద్భుతంగా జరిగింది దాంతో అమితాబచ్చన్ వెళ్తూ వెళ్తూ సలాం రామ్ భయ్యా అని చెప్పాడట.