పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘హరిహర వీరమల్లు’.ఇప్పటికే ఈ సినిమా 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.
అయితే ఈ సినిమా పలు కారణాలతో షూటింగ్ నిలిచి పోయింది.అయినా కూడా ఈ సినిమాపై పవన్ అభిమానులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.
కారణం.మొదటిసారిగా పవన్ పీరియాడిక్ యాక్షన్ సినిమాలో నటిస్తుండడం.అలాగే ఈ సినిమా పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండటం వల్ల భారీ అంచనాలు పెరిగాయి.అసలు ఈ సినిమా నుండి అప్డేట్ వస్తుందా.
రాదా అని ఎదురు చుసిన వారంతా పవర్ స్టార్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుండి చిన్న గ్లిమ్స్ రిలీజ్ చేయడంతో ఫుల్ సంతోషంగా ఉన్నారు.
ఈ గ్లిమ్స్ చుసిన తర్వాత ఈ సినిమా విషయంలో ఫ్యాన్స్ ఆందోళన చాలా వరకు పోయింది.
చిన్న వీడియోతోనే అదరగొట్టిన క్రిష్ ఈ సినిమాను పర్ఫెక్ట్ గా చెక్కితే ఇక తిరుగుండదు.ప్రేక్షకులకు నచ్చే విధంగా తీయగలిగితే భారీ హిట్ కొట్టడం ఖాయం.ఈ నెలలో పవన్ షూట్ లో జాయిన్ అవ్వబోతున్నారు అంటూ టాక్ బయటకు రావడంతో ఫ్యాన్స్ మరింత సంతోషంగా ఉన్నారు.
తాజాగా ఈ సినిమా నుండి మరొక ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది.
ఇందులో ఇంటర్వెల్ ముందు హీరో, విలన్ మధ్య మంచి హై వోల్టేజ్ సన్నివేశాలు ఉంటాయట.ఈ సన్నివేశాల్లో విలన్ పవన్ ను ‘జనాల్లో ఒక్కరైనా నీ కోసం వస్తారా’ అంటూ డైలాగ్ చేబుతాడట.
ముందు విలన్ అంటే భయం ఉండడంతో ఎవరు రారట.కానీ ఆ తర్వాత హీరో చెప్పే డైలాగ్ తో ఒక్కరు ఆ వెనుక వందలమంది వస్తారట.

ఈ సన్నివేశం ప్రేక్షకులకు ముఖ్యంగా జనసైనికులకు మంచి కిక్ ఇస్తుందని టాక్ బయటకు వచ్చింది.ఈ సన్నివేశం జనసేన పార్టీకి అనుకూలంగా ఉంటుందట.క్రిష్ ఎప్పుడు మంచి మెసేజ్ చెప్పే ప్రయత్నం చేస్తుంటాడు.ఈసారి కూడా అలానే చేయబోతున్నట్టు తెలుస్తుంది.