ఆ కమెడియన్ తండ్రి నోటి నుండి రాజీవ్ కనకాల పేరు.. ఇక ఆపండి అంటూ సుమ కౌంటర్!

టాలీవుడ్ లో ఒక స్టార్ హీరో గురించి ప్రేక్షకులకు కూడా అంతా తెలుస్తుందో లేదో తెలియదో కానీ యాంకర్ సుమ గురించి మాత్రం తెలినోలే లేరు.టాలీవుడ్ ఇండస్ట్రీలో బెస్ట్ యాంకర్ గా నిలిచి మంచి పేరు సంపాందించుకుంది.

 Rajiv Kanakala Name Said By That Comedian Father Suma Counter That In Cash Show-TeluguStop.com

స్టార్ నటీనటులకు ఉన్న క్రేజ్ యాంకర్ సుమకు ఉంది.ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.

అంతేకాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆల్ రౌండర్ గా నిలిచింది.

బుల్లితెరపై ఎన్నో ఏళ్ల నుండి యాంకరింగ్ చేస్తూ స్టార్ యాంకర్ గా నిలిచింది.

వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది.కానీ సుమ కు యాంకర్ గానే మంచి క్రేజ్ వచ్చింది.

ఒక ఎంటర్టైన్మెంట్ షో లలోనే కాకుండా వెండితెర కు సంబంధించిన సినీ అవార్డు ఫంక్షన్లలో, ప్రీ రిలీజ్ ఈవెంట్ లలో ఇలా ప్రతి ఒక్క ఈవెంట్ లో సుమ తన హోస్టింగ్ తో బాగా సందడి చేస్తుంది.

ప్రస్తుతం బుల్లితెరపై పలు షో లలో బాగా బిజీగా ఉంది.

ఇక సుమ మాటలు వింటే మాత్రం ఎవరైనా కరగాల్సిందే.తను వేసే పంచులు కూడా ఇతరులను నొప్పించకుండా ఉంటాయి.

పైగా అందరిని ఎలా కనెక్ట్ చేసుకోవాలో సుమకు తెలుసు.సుమ అంటేనే మంచి ఎంటర్టైన్మెంటర్.

స్టార్ నటీనటుల నైనా సరే సుమ తన గల గల మాటలతో వారిని కూడా ఫిదా చేస్తుంది.

ఇతర భాషలకు చెందిన సెలబ్రెటీలను కూడా సుమ ఒక రేంజ్ లో ఆట ఆడిస్తుంది.ఇంతవరకు సుమకు ఎటువంటి విమర్శలు కూడా రాలేదు.ఎందుకంటే ఆమె ఉండే విధానం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది.

ఆమె మాట్లాడే విధానం అందర్నీ ఆకర్షిస్తుంది.అటువంటి సుమకు భవిష్యత్ తరాల వారికి కూడా తన యాంకరింగ్ చూపించే శక్తి ఉందని సులువుగా చెప్పవచ్చు.

ఇక సుమ అందరి కుటుంబ, వ్యక్తిగత విషయాల గురించి బాగా అడిగి తెలుసుకుంటుంది కానీ తన గురించి మాత్రం ఎక్కువగా బయట పెట్టదు.ఒకవేళ పెట్టాల్సిన పరిస్థితి వచ్చినా కూడా సుమ వెంటనే తన ఫ్యామిలీ టాపిక్ ను డైవర్ట్ చేస్తుంది.సుమ షో కు వచ్చిన చాలామంది రాజీవ్ కనకాల గురించి ఏదో ఒక టాపిక్ తీస్తుంటారు.కానీ ఆ విషయాన్ని అక్కడికే స్టాప్ చేస్తుంది.

ఇదిలా ఉంటే తాజాగా తన క్యాష్ షో లో కూడా రాజీవ్ కనకాల టాపిక్ రావడంతో వెంటనే మళ్లీ డైవర్ట్ చేసింది.ఇంతకు అసలేం జరిగిందంటే.

సుమ హోస్టింగ్ చేస్తున్న క్యాష్ ప్రోగ్రాం కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది.అందులో కమెడియన్ బుల్లెట్ భాస్కర్, రాంప్రసాద్, విష్ణు ప్రియ, మేఘన తమ పేరెంట్స్ తో షో కి వచ్చారు.

ఇక సుమ వాళ్ళ తో బాగా సందడి చేసింది.

దీంతో బుల్లెట్ భాస్కర్ తండ్రి కూడా బాగా పంచులు వేశాడు.తల్లి గొప్ప, తండ్రి గొప్ప అనే ప్రశ్న ఎదురవడంతో వెంటనే మరో కంటెస్టెంట్ తల్లి.సుమని ఉద్దేశిస్తూ ఆడవాళ్ళ గురించి గొప్పగా చెప్పింది.

వెంటనే భాస్కర్ తండ్రి రాజీవ్ కనకాల గురించి మాట్లాడుతుండడంతో ఇక సుమ.చాలు ఈ టాపిక్ ఇక్కడితో ఆపేయండి అంటూ టాపిక్ డైవర్ట్ చేసింది.ఇక వెంటనే బుల్లెట్ భాస్కర్ తండ్రి కూడా ఆ టాపిక్ లో నుంచి బయటికి వచ్చాడు.ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట్లో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube