తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న హీరోలలో రజనీకాంత్ ( Rajinikanth )టాప్ హీరో అన్న విషయం మనందరికీ తెలిసిందే.గత 40 సంవత్సరాల నుంచి ఆయన అక్కడ సూపర్ స్టార్ గా వెలుగొందుతున్నాడు.
ఇక ఇదే క్రమంలో కమలహాసన్ కూడా అక్కడ స్టార్ హీరో గానే ఉన్నాడు అయినప్పటికీ రజినీకాంత్ కి ఉన్నంత క్రేజ్ కమలహాసన్ కి లేదు.ఎందుకంటే కమలహాసన్( Kamal hasan ) క్లాస్ సినిమాలు ఎక్కువగా చేస్తాడు, కానీ రజనీకాంత్( Rajinikanth ) మాత్రం మాస్ లో ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న హీరో…
ఎప్పుడైనా క్లాస్ హీరో కంటే మాస్ హీరోకి ఎక్కువ మార్కెట్ ఉంటుంది అలాగే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంటుంది.అందుకే రజనీకాంత్ కి కూడా తమిళనాడులో సూపర్ ఫాలోయింగ్ ఉంది.ఇక రజనీకాంత్( Rajinikanth ) కంటే కమలహాసన్ ముందుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ రజనీకాంత్ మాత్రం కమలహాసన్ ని డామినేట్ చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు.
నిజానికి వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయినప్పటికీ ఒక సినిమా విషయంలో ఇద్దరు గొడవ పడాల్సి వచ్చిందట అది ఏ సినిమా అంటే రజినీకాంత్ హీరోగా వచ్చిన నరసింహ సినిమా >( Narasimha )విషయంలో కమలహాసన్ కి రజినీకాంత్ కి మధ్య చిన్న క్లాష్ అయినట్టుగా అప్పట్లో కోలీవుడ్ మీడియా భారీ ఎత్తున ప్రచారం చేసింది.
అయితే అసలు మ్యాటర్ ఏంటి అంటే కేఎస్ రవికుమార్( KS Ravikumar ) డైరెక్షన్ లో వచ్చిన నరసింహ సినిమా( Narasimha )ను మొదట కమల్ హాసన్ తో చేద్దామని అనుకున్నారట కానీ కమలహాసన్ అప్పుడు కొన్ని సినిమాల్లో బిజీగా ఉండి ఆ స్క్రిప్ట్ ని హోల్డ్ లో పెట్టారంట అలాగే డైరెక్టర్ కే ఎస్ రవికుమార్ తో ఆ సినిమా ఎవరితో చేయకు మనిద్దరం కలిసి చేద్దామని చెప్పాడంట అయినప్పటికీ ఆ సినిమా స్టోరీ రైటర్ అయిన చిన్నికృష్ణ ఆ స్టోరీ ని రజనీకాంత్ కి చెప్పాడంట దాంతో రజనీకాంత్ మనం ఈ సినిమా చేద్దామని అని కే ఎస్ రవికుమార్ ని అడిగాడట దాంతో కే ఎస్ రవికుమార్ మళ్లీ కమలహాసన్ ని అడిగితే నాకు ఇంకా టైం పడుతుందని చెప్పడంతో రవికుమార్ వెయిట్ చేయలేక ప్రస్తుతం డేట్స్ ఇచ్చిన రజనీకాంత్ తో ఈ సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు అయితే రజనీకాంత్ కమల్ హాసన్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయినప్పటికీ ఆ టైంలో కొద్ది రోజులు కమలహాసన్ రజనీకాంత్ తో మాట్లాడలేదని తమిళ్ మీడియా అప్పట్లో వార్తలు రాసింది…
.