సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమా ఇటీవలే గ్రాండ్ గా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.మహేష్ బాబు ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు.
ఇటీవలే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లి ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తి చేసింది.ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు అగ్ర దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు.
ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇటీవలే ట్రిపుల్ ఆర్ సినిమాతో రాజమౌళి మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే.
ఇక ఈ సినిమా అవుక్టోబర్ 22న జపాన్ లో గ్రాండ్ గా రిలీజ్ చేసారు.ఈ సందర్భంగా రాజమౌళితో పాటు చరణ్, ఎన్టీఆర్ కూడా ప్రొమోషన్స్ కోసం అక్కడికి వెళ్లారు.
ఈ ప్రొమోషన్స్ లో భాగంగా మహేష్ సినిమా గురించి కూడా రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసాడు.
వచ్చే ఏడాది స్టార్ట్ కాబోతున్న ఈ సినిమాపై అప్పుడే అంచనాలు భారీగా క్రియేట్ చేయడంతో ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని అంతా ఎదురు చూస్తున్నారు.
మహేష్ సినిమా స్క్రిప్ట్ వర్క్ గత కొన్ని రోజులుగా జరుగుతూనే ఉంది.హాలీవుడ్ స్థాయిలో అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలతో ఇంటర్నేషనల్ సినిమాగా తీసుకు రావాలని కసరత్తులు కూడా స్టార్ట్ చేసారు.
ఇక ఈ సినిమాలోని కొన్ని యాక్షన్ సన్నివేశాలను జపాన్ లో కూడా షూట్ చేస్తానని రాజమౌళి జపాన్ మీడియాకు చెప్పాడు.

ఇదొక యాక్షన్ అడ్వెంచర్ అని ప్రపంచ వ్యాప్తంగా ప్రయాణించే కథ అని తెలిపాడు.ఇక తాజాగా ఈ సినిమా విషయంలో మరో వార్త వైరల్ అయ్యింది.ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ అడ్వెంచర్ ప్రాజెక్ట్ కోసం మహేష్ పై నరమాంస భక్షకుల నేపథ్యంలో ఒక టెర్రిఫిక్ యాక్షన్ ఘట్టాన్ని జక్కన్న ప్లాన్ చేసాడని.
ఇది ఈ సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని టాక్.చూడాలి ఎన్ని హంగులతో ఈ సినిమా స్టార్ట్ అయ్యి పూర్తి అవుతుందో.దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మాత కె.ఎల్ నారాయణ ఈ సినిమా భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.