క్రియేటివ్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘బాహుబలి’ సినిమా కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అనే ప్రశ్నకు సమాధానం కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు.రోజుకొక న్యూస్ ని చెప్పుతూ సినిమాకి హైప్ ని క్రియేట్ చేస్తున్నారు.
రాజమౌళి ఈ సినిమాను సెంటిమెంట్ పరంగా బాగుంటుందని 2017 ఏప్రియల్ 14 ఉగాది రోజున విడుదల చేస్తానని సంకేతాలు ఇచ్చాడు.
అయితే కరణ్ జోహార్ ‘బాహుబలి 2’ 2017, ఏప్రిల్ 28న విడుదలవుతున్నట్టు ‘బాహుబలి’ అఫీషియల్ ఫేస్ బుక్ పేజీలో పెట్టి అందరికీ షాక్ ఇచ్చాడు.అయితే దీని వెనక ఏమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో కూడా చర్చలు జరుగుతున్నాయి.
‘బాహుబలి 2’ ఇంటర్నేషనల్ మార్కెట్ బిజినెస్ వ్యవహారాలు అన్ని కరణ్ జోహార్ చూసుకుంటున్నాడు.తన ఆధిపత్యాన్ని చాటుకోవడానికి ఈ విధంగా డేట్ ఎనౌన్స్ చేసాడని కామెంట్స్ వస్తున్నాయి.
రాజమౌళి కూడా బాహుబలి మొదటి భాగం కంటే రెండో భాగం బాగా రావాలని చాలా కష్టపడుతున్నాడు.