కాబోయే భర్తను పరిచయం చేసిన ఎన్టీఆర్ హీరోయిన్.. ఫోటో వైరల్!

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి రాధ ( Radha ) ఒకరు.అప్పట్లో ఈమె టాలీవుడ్ స్టార్ హీరోలతో పాటు కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా స్టార్ హీరోలు అందరి సరసన నటించి ఇండస్ట్రీలో వెలుగు వెలిగారు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రాధ పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.

 Radha Daughter Karthika Introduced Her Fiance Photo Goes Viral, Radha, Karthika,-TeluguStop.com

ఈమె తన ఇద్దరు కుమార్తెలను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేసిన వీరు మాత్రం రాధ స్థాయిలో ఇండస్ట్రీలో సక్సెస్ కాలేకపోయారని చెప్పాలి.

ఇక రాధ పెద్ద కుమార్తె కార్తిక ( Karthika ) నాగచైతన్య హీరోగా నటించిన జోష్ సినిమా( Josh movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.అలాగే రంగం ఎన్టీఆర్ హీరోగా నటించిన దమ్ము వంటి సినిమాలలో నటించారు.అయితే ఈమె మాత్రం హీరోయిన్గా పెద్దగా ఇండస్ట్రీలో సక్సెస్ కాలేకపోయారు.

ఇలా హీరోయిన్గా ఈమెకు సరైన సక్సెస్ లు రాకపోవడంతో ఈమె సినీ కెరియర్ చాలా త్వరగా ముగిసింది.ఇలా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి ఈమె వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి బిజినెస్ ఉమెన్ గా మాత్రం ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

ఇలా కెరియర్ పరంగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి కార్తిక త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే విషయం మనకు తెలిసిందే.ఇప్పటికే ఈమె నిశ్చితార్థపు ఫోటోలను కూడా సోషల్ మీడియాలో రాధా షేర్ చేయగా ఈ ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి.అయితే కార్తీక తనకు కాబోయే భర్త ఫేస్ రివిల్ చేయకుండా దాచారు.ఇక వీరి పెళ్లి తేదీ దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఈమె తనకు కాబోయే వ్యక్తిని అందరికీ పరిచయం చేశారు.

ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కార్తిక తనకు కాబోయే భర్త రోహిత్ మీనన్( Rohith Menon ) తో కలిసి ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేస్తూ నిన్ను కలవడం డెస్టినీ ప్రకారం జరిగింది.

నీతో ప్రేమలో పడడం మ్యాజిక్.నీతో జీవితాన్ని పంచుకునేందుకు కౌంట్ డౌన్ ప్రారంభించా అంటూ పోస్ట్ వైరల్ గా మారడంతో ఈమె ప్రేమ వివాహం చేసుకుంటుందని పలువురు కామెంట్లు చేయడమే కాకుండా వీరికి ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube