టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా తమిళ్ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా గాడ్ ఫాదర్.ఈ సినిమా మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతుంది.
ఈ సినిమాలో చిరు గాడ్ ఫాదర్ గా కనిపిస్తాడు.ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ చేసుకుని ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది.
చిరంజీవి 153వ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కుతుంది.పొలిటికల్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ సల్మాన్ ఖాన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.సల్మాన్ ఖాన్ ఇటీవలే షూటింగ్ లో జాయిన్ అయి తన పార్ట్ షూటింగ్ పూర్తి చేసాడు.
ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ మాత్రమే కాదు ఇప్పుడు మరొక స్టార్ యాడ్ అయ్యాడు.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ నటిస్తున్నట్టు ప్రకటించారు.
ఈయన సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేస్తూ పూరీ తన గాడ్ ఫాదర్ సినిమాలో ప్రత్యేకమైన రోల్ చేస్తున్నట్టు తెలిపారు.ఈ క్రమంలో ఆయనకు బొకే ఇచ్చి మరి సాదరంగా ఆహ్వానించారు.
ఈ ఫోటోను చిరంజీవి షేర్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా పూరీ గురించి పోస్ట్ చేసారు.
చిరు ట్వీట్ చేస్తూ.”నర్సీపట్నం నుంచి ఓ కుర్రాడు,వెండితెర పైన నటుడిగా వెలుగు వెలగాలని,హైదరాబాద్ వచ్చాడు.ఒకటి అరా వేషాలు వేసాడు ఇంతలో కాలం చక్రం తిప్పింది.
స్టార్ డైరెక్టర్ అయ్యాడు.కానీ అతని మొదటి కల అలా మిగిలిపోకూడదు కదా.అందుకే నా సినిమాలో కీలక రోల్ లో నటిస్తున్నాడు” అంటూ చిరు ట్వీట్ చేసారు.ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యింది.
ఇక ఈ సినిమాను సూపర్ గుడ్ ఫిలిమ్స్ పతాకంపై ఎన్వీ ప్రసాద్, ఆర్ .బి .చౌదరి నిర్మిస్తున్నారు.చిరంజీవి ఈ సినిమా కంటే ముందు ‘ఆచార్య’ సినిమాలో నటించాడు.
ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.ఈ సినిమాలతో పాటు చిరంజీవి ‘భోళా శంకర్’ సినిమా కూడా ప్రకటించాడు.
గాడ్ ఫాదర్ తో పాటు ఈ సినిమాను కూడా సెట్స్ మీదకు తీసుకు వెళ్ళాడు చిరు.