రష్మీని ఫిల్మ్ ఛాంబర్ గేటుకు కట్టేసి కొడతానన్నా.. నిర్మాత వివాదాస్పద వ్యాఖ్యలు వైరల్!

ప్రముఖ టాలీవుడ్ యాంకర్లలో ఒకరైన రష్మీ వివాదాలకు దూరంగా ఉంటారనే సంగతి తెలిసిందే.కొన్నేళ్ల క్రితం వరకు రష్మీ వరుస సినిమా ఆఫర్లతో బిజీగా ఉండగా గతంతో పోలిస్తే రష్మీకి సినిమా ఆఫర్లు తగ్గడం గమనార్హం.

 Producer Balaji Nagalingam Comments On Rashmi Goes Viral In Social Media Details-TeluguStop.com

రష్మీ నటించిన బొమ్మ బ్లాక్ బస్టర్ రిలీజ్ కావాల్సి ఉండగా చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఒక సినిమాలో కీలక పాత్రకు రష్మీ ఎంపికయ్యారని ప్రచారం జరుగుతోంది.అయితే ప్రముఖ నిర్మాత ఒకరు రష్మీ గౌతమ్ గురించి షాకింగ్ కామెంట్లు చేశారు.

ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన బాలాజీ నాగలింగం మాట్లాడుతూ రష్మీ తమ బ్యానర్ లో రాణిగారి బంగ్లా అనే సినిమా చేసిందని తెలిపారు.తాను ఎవరినీ కోపం వచ్చినా తిట్టనని ఆయన తెలిపారు.

రష్మీ సినిమాకు ఒప్పుకుందని రష్మీ రెమ్యునరేషన్ కు అంగీకరించి షూటింగ్ లో పాల్గొందని బాలాజీ నాగలింగం చెప్పుకొచ్చారు.ఒక సాంగ్, డబ్బింగ్ బ్యాలెన్స్ ఉన్న సమయంలో రష్మీ ఇబ్బందులకు గురి చేసిందని బాలాజీ నాగలింగం వెల్లడించారు.

రష్మీతో బడ్జెట్ లో చేయాల్సిన సినిమా అని చెప్పానని అయితే ఆ సమయంలో గుంటూరు టాకీస్ హిట్టైందని

Telugu Anchorrashmi, Guntur, Nagababu, Ranigari Bangla, Rashmi-Movie

రష్మీ హీరోతో సాంగ్ చేయనని తమతో చెప్పిందని హీరోను మార్చేయాలని రష్మీ అడిగిందని బాలాజీ నాగలింగం చెప్పుకొచ్చారు.రష్మీ వ్యక్తిగత కోపాలను తమపై చూపించిందని ఆ అమ్మాయి తనతో ఏం చెప్పిందో రికార్డ్ ఉందని బాలాజీ నాగలింగం వెల్లడించారు.నాగబాబు తెలుసని, శ్యామ్ ప్రసాద్ రెడ్డి తెలుసని రష్మీ బెదిరించిందని బాలాజీ నాగలింగం అన్నారు.

Telugu Anchorrashmi, Guntur, Nagababu, Ranigari Bangla, Rashmi-Movie

రష్మీ అలా చేయడంతో ఫిల్మ్ ఛాంబర్ గేటుకు కట్టేసి కొడతానని అన్నానని బాలాజీ నాగలింగం తెలిపారు.ఛానల్ కు ఎక్కిస్తా అని రష్మీ బెదిరించిందని ఆయన అన్నారు.తాను నిజాయితీ కోసం కట్టేస్తా అని అన్నానని మొత్తం డబ్బులు ఇచ్చిన తర్వాత రష్మీ అలా చేసిందని ఆ తర్వాత మూడు నెలలు ఆగి రష్మీ షూటింగ్ లో పాల్గొన్నారని బాలాజీ నాగలింగం అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube