లవ్ స్టోరీనే కానీ అలా ఉండదు.. క్లైమాక్స్ అందరికి నచ్చుతుంది : ప్రభాస్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా సినిమా ‘రాధేశ్యామ్‘.రోమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారు.ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఇక విడుదల తేదీ కూడా దగ్గర పడడంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచేశారు చిత్ర యూనిట్.

 Prabhas Speech At Radhe Shyam Pre Release Event, Prabhas, Prabhas Speech, Radhe-TeluguStop.com
Telugu Poojaa Hegde, Prabhas, Prabhas Speech, Prabhasspeech, Radha Krishna, Radh

ఇప్పటికే ఈ సినిమా నుండి సాంగ్స్, పోస్టర్స్, టీజర్ వంటివి వదిలారు.వీటితో ఈ సినిమా రెగ్యులర్​ ప్రేమ కథ కాదని అంతకు మించి ఉంటుందని ఈ సినిమాపై మరింత ఆసక్తి పెంచుకున్నారు.ఇక తాజాగా నిన్న రాత్రి జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ఈ సినిమా మరింత జనాలకు రీచ్ అయ్యేలా భారీ స్థాయిలో నిర్వహించారు.ఈ ఈవెంట్ లోనే ఈ సినిమా ట్రైలర్ ను ప్రభాస్ ఫ్యాన్స్ చేతుల మీదుగా రిలీజ్ చేయించారు.

ఇక ఈ వేదికపై ప్రభాస్ మాట్లాడుతూ.ట్రైలర్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను.

పెద్ద నాన్న గారి ఫోటో చూసారా.చిన్నపాటి దేవుడిలా ఉన్నారు.

గోపికృష్ణ సినిమా అంటే కొద్దిగా టెన్షన్ ఉంటుందని పెద్ద నాన్న గారి మనవూరి పాండవులు, బొబ్బిలి బ్రహ్మన్న లాంటి పెద్ద సినిమాలు చేసారు.ఆ తర్వాత బిల్లా, ఇప్పుడు రాధేశ్యామ్ సినిమాలు చేసాం అని చెప్పుకొచ్చాడు.

Telugu Poojaa Hegde, Prabhas, Prabhas Speech, Prabhasspeech, Radha Krishna, Radh

ఇంకా రాధేశ్యామ్ సినిమా గురించి మాట్లాడుతూ.ఈ సినిమా కథ లవ్ స్టోరీ నే కానీ.సినిమాలో చాలా ట్విస్టులు ఉన్నాయని తెలిపాడు.అంతేకాదు క్లైమాక్స్ అందరికి నచ్చుతుంది అని ప్రభాస్ చెప్పుకొచ్చాడు.ఈ సినిమా స్టార్ట్ అయ్యి అప్పట్లో సాహో వల్ల కొద్దిగా ఆగిందని.ఆ తర్వాత కరోనా వల్ల ఇంకొన్ని రోజులు ఆగి పీఠానికి ఐదేళ్ల పాటు ఈ సినిమా కోసం కూర్చోవడం మాములు విషయం కాదు.

నిజంగా మెచ్చుకోదగ్గ విషయం అని ఆ క్రెడిట్ అంత రాధా కృష్ణకే దక్కుతుంది అని ప్రభాస్ చెప్పుకొచ్చాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube