ఆక‌ట్టుకుంటోన్న `డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు` క్యారెక్ట‌ర్ పోస్ట‌ర్స్‌..

సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ‌ సినిమాటోగ్రాఫ‌ర్ కేవి గుహన్ ద‌ర్శ‌కత్వంలో అదిత్‌ అరుణ్, శివాని రాజశేఖర్‌ హీరో హీరోయిన్లుగా రామంత్ర క్రియేష‌న్స్ పతాకంపై డా.రవి ప్రసాద్ రాజు దాట్ల నిర్మించిన థ్రిల్ల‌ర్ మూవీ ‌’డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు‘(ఎవ‌రు, ఎక్క‌డ‌, ఎందుకు).

 Impressive `www` Character Posters‌ , Tollywood , Adith Tharun , Shivani Raja-TeluguStop.com

ఫస్ట్‌ టైమ్ కంప్యూటర్‌ స్క్రీన్ బేస్డ్ మూవీగా రూపొందిన ఈ చిత్రం డిసెంబ‌రు 24న సోనిలీవ్‌లో డైరెక్ట్ రిలీజ్ కానుంది.ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైల‌ర్ విశేష స్పంద‌న ద‌క్కించుకోగా ఈ చిత్రంలోని న‌టీన‌టుల పాత్ర‌ల‌కు సంబందించి క్యారెక్ట‌ర్ పోస్ట‌ర్స్‌ను ఈ రోజు విడుదల‌ చేశారు.

అదిత్ అరుణ్ `విశ్వ‌`గా న‌టిస్తుండ‌గా, శివాని రాజ‌శేఖ‌ర్ `మిత్ర` పాత్ర పోషిస్తుంది.వారి మిత్రులుగా `అష్ర‌ఫ్` పాత్ర‌లో ప్రియ‌ద‌ర్శి, `చిష్ట్రి` పాత్ర‌లో దివ్య శ్రీ‌పాద న‌టిస్తున్నారు.

వైవా హర్ష, సత్యం రాజేష్ ముఖ్య పాత్ర‌లు పోషిస్తుండగా న‌టుడు రియాజ్ ఖాన్ `ఖాన్‌`పాత్ర‌ధారిగా కనిపించ‌నున్నారు.ఈ కాన్సెప్ట్ పోస్ట‌ర్స్ ఆక‌ట్టుకుంటున్నాయి.

అదిత్‌ అరుణ్, శివాని రాజశేఖర్, ప్రియదర్శి, వైవా హర్ష, దివ్య, రియాజ్ ఖాన్, సత్యం రాజేష్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి…

స‌మ‌ర్ఫ‌ణ‌: సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యానర్‌: రామంత్ర క్రియేషన్స్.కథ, స్క్రీన్‌ ప్లే, సినిమాటోగ్రఫి, దర్శకత్వం: కె వి గుహన్.నిర్మాత: డా.రవి ప్రసాద్ రాజు దాట్ల కో–ప్రొడ్యూసర్‌: విజయ్‌ ధరణ్‌ దాట్ల.సంగీతం: సైమన్‌ కె.కింగ్.ఎడిటింగ్‌: తమ్మిరాజు.ఆర్ట్‌: నిఖిల్‌ హాసన్.డైలాగ్స్‌: మిర్చి కిరణ్ లిరిక్స్‌: రామజోగయ్యశాస్త్రి, అనంత శ్రీరామ్, రోల్‌రైడా.కొరియోగ్రఫి: ప్రేమ్‌ రక్షిత్.స్టంట్స్‌: రియల్‌ సతీష్.కాస్ట్యూమ్‌ డిజైనర్‌: పొన్మని గుహన్ ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: కె.రవి కుమార్

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube