సీరియల్ నటులతో నిండినా అది పురుష్.. గట్టెక్కేనా ?

ఆదిపురుష్. టాలీవుడ్ లో ప్రస్తుతం సంచలనానికి మారుపేరుగా నిలిచింది.

 Prabhas Adipurush Casting With Serial Actors Details, Adipurus, Prabhas, Prabhas-TeluguStop.com

ఒకే ఒక్క టీజర్ తో ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమాపై భారీ ట్రోలింగ్ తో పాటు అంచనాలు సైతం ఒకే రేంజ్ లో పెరిగాయి.ఇప్పటి వరకు కనివిని ఎరగని రీతిలో రామాయణాన్ని ఆధునికత జోడించి దర్శకుడు ఓం రౌత్ ఎలా తీయాకెక్కించాడో చూడాలని ప్రభాస్ ఫ్యాన్స్ తో పటు జనాలు అంత కూడా కోరుకుంటున్నారు.

కృతి సనన్, సైఫ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఆదిపురుష్ సినిమాలో తెలుగు నటీనటుల జాడ కనిపించలేదు.ఎక్కువ శాతం బాలీవుడ్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని దర్శకుడు కాస్టింగ్ చేసినట్టుగా టీజర్ ద్వారా అర్థమైపోయింది.

 Prabhas Adipurush Casting With Serial Actors Details, Adipurus, Prabhas, Prabhas-TeluguStop.com

ఈ చిత్రానికి భారీ బడ్జెట్ సైతం రిచ్ గ్రాఫిక్స్ ని, అదనపు హంగులను అద్దడానికి తోడ్పడ్డాయని తెలుస్తుంది.మరో వైపు ప్రభాస్ తో పాటు ఎక్కువ భాగం స్క్రీన్ పంచుకుంటున్న ఇద్దరు నటుల గురించి సోషల్ మీడియాలో చర్చ సాగుతుంది.

అది మరెవరో కాదు.ఒకరు హనుమాన్ పాత్రధారి కాగా మరొకరు లక్ష్మణ పాత్రధారి.

అయితే ఇంత లీడ్ ప్రాధాన్యత ఉన్న పాత్రల కోసం సీరియల్ ఆర్టిస్టులను ఎంచుకున్నాడు దర్శకుడు.ఈ విషయం ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఆదిపురుష్ సినిమాను ఏకంగా సీరియల్ స్టార్స్ తో నింపడం ఏంటి అంటూ ఒక వర్గం ప్రేక్షకులు భావిస్తున్నారు.

ఆదిపురుష్ సినిమాలో హనుమాన్ పాత్రలో నటించిన నటుడి పేరు దేవదత్త నాగే. ముంబై నివాసి అయినా దేవదత్త కలర్స్ టీవీ లో వచ్చిన వీర్ శివాజీ సీరియల్ లో తానాజీ పాత్రలో తొలిసారి నటించాడు.ఆ తర్వాత మరో కొన్ని సీరియల్స్ లో నటించిన తర్వాత సినిమాల్లో అవకాశాలు రావడం మొదలయ్యాయి.

దాంతో నటుడిగా సిల్వర్ స్క్రీన్ పై ఎస్టాబ్లిష్ అయ్యి ఏకంగా పాన్ ఇండియా సినిమాలో ప్రభాస్ పక్కన హనుమంతుడి పాత్రలో నటించే అదృష్టం కొట్టేసాడు.

ఇక లక్ష్మణుడి పాత్రలో అంటించిన నటుడి పేరు సన్నీ సింగ్. 2013 లో చెన్నై ఎక్ష్ప్రెస్స్ సినిమాకు స్టంట్ డైరెక్టర్ గా పని చేసిన సన్నీ ఆ తర్వాత 2016 లో శివాయ్ సినిమాకు కూడా స్టంట్ దర్శకుడిగా పని చేసాడు.ఆంతకంటే ముందు కొన్నేళ్ల పాటు సినిమాల్లో, సీరియల్స్ లో నటిస్తూ కెరీర్ ని రెండు రంగాల్లో విస్తరించుకున్నాడు.

ఇరవెళ్లకు పైగా ఇండస్ట్రీ లో ఉన్నప్పటికీ సన్నీ కి సరైన అవకాశాలు రాలేదనే చెప్పాలి.ఇక ఆదిపురుష్ సినిమా సక్సెస్ అయితే సన్నీ కి మరిన్ని మంచి పాత్రలు లభించే అవకాశాలు ఉన్నాయ్.

Serial Actors in Prabhas Adipurush Movie

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube