వైసీపీ లో చేరిపోయిన 'జనసేన ' పోతిన మహేష్ 

జనసేన పార్టీ(Janasena party )లో కీలక నేతగా గుర్తింపు పొందిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కు చెందిన పోతిన మహేష్ ఎట్టకేలకు వైసీపీలో చేరిపోయారు.ఇటీవల జనసేన ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో తన పేరు ఉంటుందనే నమ్మకంతో మహేష్ ఉంటూ వచ్చారు.

 Pothina Mahesh Who Joined Ycp Left 'jana Sena' Janasena, Pothina Mahesh,ap Cm J-TeluguStop.com

ఈ మేరకు పవన్ నుంచి ఆయనకు హామీ లభించింది.దీంతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టికెట్ తనకే దక్కుతుందని మహేష్ నియోజకవర్గంలో విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టారు.

అయితే ఆ నియోజకవర్గాన్ని పొత్తులో భాగంగా బిజెపికి కేటాయించడంతో మహేష్ కు టికెట్ దక్కలేదు.దీంతో అనేక రూపాల్లో తన అసంతృప్తిని వెళ్లగక్కిన మహేష్ రెండు రోజుల క్రితం జనసేనలో చోటు చేసుకున్న పరిణామాలపై బహిరంగంగా విమర్శలు చేశారు.

Telugu Ap Cm Jagan, Ap, Cm Jagan, Jagan, Janasenani, Pothina Mahesh, Ysrcp-Polit

అంతేకాకుండా అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) వైఖరిని తప్పుపడుతూ ఆయనకు సవాల్ విసిరారు.త్వరలోనే జనసేన ను టిడిపిలో విలీనం చేయబోతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.అంతేకాకుండా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఉగాది రోజున అన్నా లెజినోవా తో కలిసి గృహప్రవేశం చేయాలంటూ సవాల్ విసిరి మరింత సంచలనం రేపారు.అయితే వైసీపీలో చేరేందుకే మహేష్ జనసేన పై విమర్శలు చేస్తున్నారని, పవన్ ఆయనకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారని, ఆయనకు టికెట్ దక్కకపోవడం, వైసీపీ నుంచి ఆఫర్ రావడంతోనే పవన్ పైన జనసేన పైన ఆయన విమర్శలు చేస్తున్నారని జనసేన నేతలు కౌంటర్ ఇచ్చారు.

తాజాగా ఈరోజు వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) సమక్షంలో మహేష్ వైసీపీ కండువా కప్పుకున్నారు.

Telugu Ap Cm Jagan, Ap, Cm Jagan, Jagan, Janasenani, Pothina Mahesh, Ysrcp-Polit

ఈ రోజు పోతిన మహేష్ పెద్ద ఎత్తున తన అనుచరులతో కలిసి జగన్ బసచేసిన గంటా వారిపాలెం వద్దకు వెళ్లి జగన్ తో భేటీ అయ్యారు.ఈ సందర్భంగా జగన్ ఆయనకు పార్టీ కండువా కప్పారు.విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైసిపి గెలుపు కోసం తాను కృషి చేస్తానని ఈ సందర్భంగా మహేష్ జగన్ సమక్షంలోనే ప్రకటించారు.

ఇకపోతే మహేష్ తో పాటు మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి సైతం ఈరోజు జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube