గుంటూరు జిల్లాలో జరిగిన తొక్కిసలాట ఘటనపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు.చంద్రన్న కానుకల పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట చోటు చేసుకోవడం దురదృష్టకరమని తెలిపారు.
ఈ ఘటనలో ముగ్గురు పేద మహిళలు చనిపోవడం దిగ్భ్రాంతిని కలిగించిందని పవన్ అన్నారు.ఇలాంటి కార్యక్రమాల విషయంలో నిర్వాహకులు పటిష్టమైన చర్యలు చేపట్టడంతో పాటు పోలీసులు తగిన భద్రత ఏర్పాట్లు చేయాలని సూచించారు.