తాడేపల్లిగూడెం “జెండా” సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.వచ్చే ఎన్నికలకు సిద్ధం అంటున్న జగన్ కి యుద్ధం ఇద్దామని పిలుపునిచ్చారు.
జగన్( jagan ) పాలనలో అందరూ మోసపోయారని విమర్శించారు.పర్వతం ఎవరికి వంగి సలాం చేయదని వైసీపీ నాయకులకు పవన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
తాము మోసే జెండా స్ఫూర్తి అని వ్యాఖ్యానించారు.జగన్ ఐదేళ్ల పాలనలో ఒక రోడ్డు అయినా బాగుపడిందా అని ప్రశ్నించారు.
క్లాస్ వారు కాస్ట్ వారు అంటున్న జగన్.ఐదు కోట్ల మంది ప్రజలనీ.
ఐదుగురు దగ్గర తాకట్టు పెట్టారని ఆరోపించారు.సొంత బాబాయిని చంపించాడు.
సొంత చెల్లిని గోడకేసి కొట్టాడు.వీళ్ళ నాకు సలహాలు ఇచ్చేది అంటూ విమర్శలు చేశారు.
అన్ని స్థానాలలో పోటీ చేయడానికి మన దగ్గర వేలకోట్లు ఉన్నాయా.? టీడీపీలా బలమైన సంస్థాగత వ్యవస్థ ఉందా.? ఇప్పుడిప్పుడే జనసేన ఇల్లు కడుతున్నం.కోట కూడా కడతాం.
తాడేపల్లి( Tadepalli ) కోట కూడా కూలగొడతాం అని హెచ్చరించారు.

ప్రజలకు పాతికేళ్లు భవిష్యత్తు ఇవ్వాలన్నేది.మా ఆకాంక్ష.అని అన్నారు.
నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుని( Chandrababu ) జైల్లో పెట్టడం తనను బాధించిందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.ఆయన భార్యని కూడా అనరాని మాటలు అంటే బాధ కలిగింది.
తన కూతురు చనిపోయిందని సుగాలి ప్రీతి తల్లి చెబితే రెండు చోట్ల ఓడి కూర్చున్న నాకు నిస్సహయతగా అనిపించింది.అందరూ కష్టాలు చెబుతుంటే చలించాను.
వీళ్ళ కోసం నేను నిలపడకపోతే.రేపు నాకోసం ఎవరూ నిలబడరు.
అందుకే పొత్తుకు ప్రతిపాదించా.అని పవన్ వ్యాఖ్యానించారు.
రానున్న 45 రోజులలో వైసీపీ గూండాలు, క్రిమినల్స్.టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు, వీర మహిళలపై దాడులకు పాల్పడితే మక్కెలు విరగ్గొట్టి… మడత మంచంలో పడుకోబెడతాం.
అని పవన్ కళ్యాణ్ సీరియస్ వ్యాఖ్యలు చేశారు.వచ్చే ఎన్నికలలో కూటమి విజయానికి అందరూ కృషి చేయాలని పవన్ పిలుపునిచ్చారు.