ఫొటో మూమెంట్‌ : లాల భీమ్లా దుమ్ము రేపింది వీరేనంటూ థమన్‌ పోస్ట్‌

పవన్‌ కళ్యాణ్ భీమ్లా నాయక్‌ సినిమా నుండి నిన్న లాల భీమ్లా అంటూ ఒక మాస్ బీట్ సాంగ్‌ వచ్చిన విషయం తెల్సిందే.ఆ సాంగ్ లో మాస్ స్టెప్పులు వేసిన లేడీస్ పాట స్థాయిని మరింతగా పెంచారు అనడంలో సందేహం లేదు.

 Pawan Kalyan Bheemla Nayak Movie Song Actress , Bheemla Nayak, Pawan Kalyan, Mov-TeluguStop.com

సినిమా లో ఆ విజువల్స్ ఉండక పోవచ్చు.కాని పాట కోసం ప్రత్యేకంగా థమన్‌ దీన్ని రూపొందించాడు.

ఈమద్య కాలంలో థమన్‌ లిరికల్ వీడియోను విడుదల చేస్తున్న విధానం అందరి దృష్టిని ఆకర్సిస్తోంది.అన్ని విధాలుగా ఆకట్టుకునే విజువల్స్ తో ఈ పాట సాగింది.

మద్య మద్యలో పవన్‌ కళ్యాణ్ కనిపించగా పాట మొత్తం ఈ ఆడవారి మాస్ స్టెప్పులు ఆకట్టుకున్నారు.అమ్మవారు పూనినట్లుగా ఊగుతూ డాన్స్ లు వేస్తూ అబ్బురపర్చారు అనడంలో సందేహం లేదు.

ఆకట్టుకునే ఆ డాన్స్ లకు జనాలు ఫిదా అవుతున్నారు.పాట మాస్ బీట్స్ కు మరియు డాన్స్ కు జనాలు ఎగబడి మరీ ఈ పాటను చూస్తున్నట్లుగా చెబుతున్నారు.

-Movie

థమన్ సంగీత సారథ్యంలో రూపొందిన ఈ పాటకు మంచి స్పందన వచ్చింది.కొందరు పాట మరీ కొంతే ఉంది.బిట్ సాంగ్ మాదిరిగా ఉందని.కొందరు థీమ్ మ్యూజిక్ మాదిరిగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.మొత్తానికి మాత్రం ఈ సినిమా ఒక రేంజ్ లో ఆకట్టుకునే విధంగా ఉంటుందని ఈ పాట మాస్ బీట్స్ మరియు ఇందులో పవన్‌ కళ్యాణ్‌ కనిపిస్తున్న తీరుతో అనిపిస్తుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.స్టార్‌ హీరోలు మరియు హీరోయిన్స్ కూడా ఈ పాటకు ఫిదా అవుతున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు.

పెద్ద ఎత్తున అంచనాలున్న భీమ్లా నాయక్ కు ఈ పాట అదనపు అంచనాలు పెంచింది అనడంలో సందేహం లేదు.అద్బుతమైన కథ మరియు కథనంతో దర్శకుడు సాగర్ చంద్ర ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

డైలాగ్స్ మరియు స్క్రీన్‌ ప్లే ను త్రివిక్రమ్‌ అందించడం వల్ల అంచనాలు మరింతగా పెరిగాయి.ఈ సినిమా లో పవన్ కు జోడీగా నిత్యా మీనన్ నటించింది.

నిత్యా మీనన్‌ బిడ్డకు తల్లి పాత్రలో కనిపించడం విశేషం.రానా కూడా ఈ సినిమా లో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube