విజయవాడ పరిసర ప్రాంతమైన కొత్తూరు, తాడేపల్లిలో అక్రమ మైనింగ్ పై అధికారులు స్పందించారు.ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే విధంగా మైనింగ్ మాఫియా రెచ్చిపోతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
గతంలో మైనింగ్ విజిలెన్స్ స్క్వాడ్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఎటువంటి ప్రయోజనం లేదని విమర్శలు గుప్పిస్తున్నారు.ఈ క్రమంలో స్పందించిన అధికారులు.
ఇప్పటివరకు అక్రమ మైనింగ్ కు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు రాలేదన్నారు.అదేవిధంగా అక్కడ ఎటువంటి అనుమతులు తీసుకోకుండానే కొందరు అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్నారని మైనింగ్ ఏడీ తెలిపారు.