భార్యను గన్ తో బెదిరించిన హీరో నితిన్.. సేఫ్ గా లేనని చెబుతూ?

దాదాపు రెండు దశాబ్దాల నుంచి సక్సెస్ ఫెయిల్యూర్ కు అతీతంగా నితిన్ వరుసగా సినిమాల్లో నటిస్తుండగా ఈ ఏడాది నితిన్ నటించిన మూడు సినిమాలు రిలీజ్ కాగా ఆ మూడు సినిమాలలో ఒక్క సినిమా కూడా భారీ బ్లాక్ బస్టర్ హిట్ కాలేదు.అయితే నితిన్ చేతిలో మాత్రం వరుస ఆఫర్లు ఉన్నాయి.

 Nithin Wife Funny Post Goes Viral In Social Media , Nithin , Wife, Funny Post-TeluguStop.com

నిన్న దీపావళి పండుగ సందర్భంగా ప్రముఖ సెలబ్రిటీలు దీపావళి పండుగను ఘనంగా జరుపుకున్నారు.

నితిన్ కూడా తన భార్య షాలినితో కలిసి దీపావళి పండుగను జరుపుకోగా నితిన్ భార్య షాలిని సోషల్ మీడియా వేదికగా అందుకు సంబంధించిన వీడియోలను పంచుకున్నారు.

నితిన్ భార్య షాలినిని నితిన్ దీపావళి రోజున గన్ తో బెదిరించడం గమనార్హం.అయితే నితిన్ బెదిరించింది నిజమైన గన్ తో మాత్రం కాదు.పిల్లలు ఆడుకునే బొమ్మ గన్ తో నితిన్ తన భార్యను బెదిరించగా నితిన్ భార్య షాలిని భయపడుతూ చెవులు మూసుకున్నారు.

షాలిని తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఈ వీడియోను షేర్ చేసి ప్రతి ఒక్కరూ దీపావళిని సేఫ్ గా జరుపుకోవాలని అయితే తాను మాత్రం సేఫ్ గా లేనని చెబుతున్నారు.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుండగా నితిన్ తో కలిసి దిగిన ఫోటోలను షాలిని అభిమానులతో పంచుకున్నారు.నితిన్ ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గం అనే సినిమాలో నటిస్తున్నారు.

యాక్షన్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ తెరకెక్కనుంది.

సాగర్ మహతి ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా కృతిశెట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. నితిన్ ఈ సినిమాతో గ్యారంటీగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.వచ్చే ఏడాది మాచర్ల నియోజకవర్గం మూవీ విడుదల కానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube