న్యూయార్క్ టైమ్స్ సంచలన కధనం..అడ్డంగా దొరికిపోయిన ట్రంప్...!!!

అమెరికా ప్రపంచ దేశాలన్నింటికీ పెద్దన్న.ఆర్థికంగా, టెక్నాలజీ పరంగా ,రక్షణ ఇలా అన్ని రంగాలలో ఎప్పుడూ ముందుండే అమెరికా, ఎలాంటి విపత్తులు అయినా ముందుగా పసిగట్టి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండే అగ్ర రాజ్యం కరోనా వైరస్ బారినపడి అల్లాడి పోతోంది.

 New York Times, America, Trump, China, Donald Trump Negligence-TeluguStop.com

ఇంత మందీమార్బలం ఉన్నా కూడా కరోనా విషయంలో అమెరికా ఎందుకు చతికిలబడి పోయింది.?? ఇన్ని వేల మంది అమెరికన్ ప్రజలు మృతి చెందారు అనే ప్రశ్నలకి న్యూయార్క్ టైమ్స్ క్లారిటీ ఇచ్చింది.

అమెరికా ఇలాంటి ఘోరమైన పరిణామాలు ఎదుర్కోవడానికి ఏకైక కారణం అధ్యక్షుడు ట్రంప్ అంటూ కధనం ప్రచురించింది.దాంతో ఒక్క సారిగా అమెరికాలో ప్రకంపనలు మొదలయ్యాయి.రెండు రోజుల క్రితమే ట్రంప్ న్యూయార్క్ టైమ్స్ మీద ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.చైనాలోకి వెళ్లడానికి సదరు పత్రిక ఉవ్విళ్లూరుతున్నారని.

ఈ వ్యాఖ్యలు చేసి రెండు రోజులు కూడా గడవలేదు ట్రంప్ పై ఒక్క సారిగా ఈ కధనం ప్రచురించి సంచలనం సృష్టించింది.ఈ కధనం ప్రకారం.

Telugu America, China, Donaldtrump, York Times, Trump-

ట్రంప్ కి జనవరిలోనే వైట్ హౌస్ అధికారులు, రక్షణ, వైద్య శాఖ అందరూ కరోనా తీవ్రత , ప్రభావం గురించి చెప్పారట.చైనాలో పరిస్థితులు వివరించి మనం ముందు జాగ్రత్తలు తీసుకోక పొతే ఎలాంటి పరిణామాలు ఎడురవుతాయో కూడా తెలిపారట.కానీ ఆర్ధిక ధృడత్వంపైనే దృష్టి పెట్టన ట్రంప్ అమెరికా ప్రజల ప్రాణాల గురించి పట్టించుకోలేదని ఈ కధనంలో రాసుకొచ్చింది.ట్రంప్ ముందుగానే మేల్కొని ఉండుంటే ఇన్ని వేలమంది అమెరికా ప్రజల ప్రాణాలు పోయేవి కావని, ఎంతో మంది అమాయకులు ట్రంప్ నిర్లక్ష్యం కారణంగా బలైపోయారని తెలిపింది.

ప్రస్తుతం ఈ కధనం అమెరికా రాజకీయాలని ఓ కుదుపు కుదుపుతోంది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube