హైదరాబాద్లో ట్రాఫిక్ పోలీసుల కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి.నిబంధనలు అతిక్రమించిన వాహనదారులకు భారీగా జరిమానాలు విధించనున్నారు.ఇందులో భాగంగా రాంగ్ రూట్ కు రూ.1700, ట్రిపుల్ రైడింగ్ కు రూ.1200 ఫైన్ పడనుందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.ఈనెల 28 నుంచి ట్రాఫిక్ పోలీసులు దీనిపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నారు.
నగరంలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ఈ రూల్స్ ను తీసుకొచ్చినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.