దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిని హైదరాబాద్ లోని యశోద ఆస్పత్రికి తరలించారు.గజ్వేల్ లో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం యశోదకు తరలించారు.
కాగా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి కడుపు భాగంలో ఐదు కుట్లు పడినట్లు తెలుస్తోంది.మరోవైపు ఘటన విషయాన్ని తెలుసుకున్న మంత్రి హరీశ్ రావు ఫోన్ లో ఎంపీ ప్రభాకర్ రెడ్డిని పరామర్శించారు.
ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.అయితే దౌల్తాబాద్ మండలంలోని సూరంపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో రాజు అనే వ్యక్తి ఆయనపై కత్తితో దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే.