ఇతను ప్రపంచంలోనే అతిపెద్ద మోసగాడు... ఏం చేశాడో తెలిస్తే షాకవుతారు!

ప్రపంచంలో చాలా మంది మోస‌గాళ్లు ఉన్నారు.ఇండియాలో కూడా ఇలాంటి మోస‌గాడు ఉన్నాడు.

 Natwarlal Aka Mithilesh Kumar Srivastava Was The World S Biggest Thug , Biggest-TeluguStop.com

ఈ మోస‌గాడిని నట్వర్‌లాల్ అని పిలిచేవారు.నట్వర్‌లాల్ అసలు పేరు మిథిలేష్ కుమార్ శ్రీవాస్తవ.

ఈ మోస‌గాడు తాజ్ మహల్‌ను 3 సార్లు, ఎర్రకోటను 2 సార్లు, రాష్ట్రపతి భవన్‌ను ఒకసారి విక్రయించాడు.ఇత‌ను బీహార్‌లోని సివాన్‌లోని బాంగ్రా అనే గ్రామంలో జన్మించాడు.

మిథిలేష్‌ది సంపన్న కుటుంబం.అతనికి చదువుపై పెద్దగా ఆసక్తి లేదు.

ఈ కారణంగానే మిథిలేష్ అలియాస్ నట్వర్‌లాల్ మెట్రిక్యులేషన్ పరీక్షలో ఫెయిల్ అయ్యాడు.దీంతో అతని తండ్రి అతన్ని తీవ్రంగా కొట్టాడు.

ఆ తర్వాత మిథిలేష్ ఇంటి నుంచి పారిపోయి కోల్‌కతా వెళ్లాడు.ఆ సమయంలో అతని వద్ద కేవలం ఐదు రూపాయలే ఉన్నాయి.

ఇక్కడికి వచ్చాక మోసాలు చేయ‌డం మొద‌లు పెట్టాడు.డెబ్బైల నుండి ఎనభైల వరకు.

నట్వర్‌లాల్ మోసాలు తారాస్థాయిలో జ‌రిగాయి.ఇమిథిలేష్ అలియాస్ నట్వర్‌లాల్ తాజ్ మహల్‌ను మూడుసార్లు, ఎర్రకోటను రెండుసార్లు, రాష్ట్రపతి భవన్‌ను ఒకసారి విక్రయించారు.

ఇంతేకాకుండా అతను ఒకసారి భారత పార్లమెంటు భవనాన్ని కూడా విక్రయించాడు.ఈ దుర్మార్గపు దుండగుడు భవనాలను మాత్రమే లక్ష్యంగా చేసుకోలేదు, అతను దేశ మొదటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ సంతకాన్ని కూడా కాపీ చేశాడు.

అతను టాటా, బిర్లాతో సహా అనేక మంది ప్రముఖ పారిశ్రామికవేత్తలను మోసానికి బలిపశువును చేశాడు.నట్వర్‌లాల్‌పై 8 రాష్ట్రాల్లో 100కి పైగా కేసులు నమోదయ్యాయి.

నట్వర్‌లాల్‌ 9 సార్లు పట్టుబడ్డాడు.త‌రువాత అతను పరార‌య్యేవాడు.

నట్వర్‌లాల్‌కు కోర్టు 113 ఏళ్ల శిక్ష విధించింది.చివరిసారిగా పోలీసుల కస్టడీలోకి వచ్చిన నట్వర్‌లాల్ వయసు 84 ఏళ్లు.1996వ సంవత్సరంలో తాను అనారోగ్యంతో ఉన్నాడని సాకుగా చూపి, చికిత్స కోసం ఎయిమ్స్‌కు తీసుకువెళ్ల‌మ‌న్నాడు.ఇంతలో మరోసారి నట్వర్‌లాల్ పోలీసులను మోసం చేసి తప్పించుకున్నాడు.

ఆ తర్వాత ఎక్కడికి వెళ్లాడో ఇప్పటి వరకు ఎవరికీ తెలియక‌పోవ‌డం విశేషం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube