కొన్నిరోజుల క్రితం వరకు ఎవరికీ పెద్దగా పరిచయం లేని అలేఖ్యారెడ్డి తారకరత్న మరణం తర్వాత ఎక్కువగా వార్తల్లో కనిపిస్తున్న సంగతి తెలిసిందే.అందరూ ఉన్నా అలేఖ్యారెడ్డి భర్త మరణం వల్ల అనాథ అయ్యారని కొంతమంది కామెంట్లు చేస్తుండగా కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
అలేఖ్య రాజకీయాల్లోకి వస్తారని వినిపిస్తున్నా ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది.
అలేఖ్యా రెడ్డి రాజకీయాల్లోకి వచ్చినా ఆమె సక్సెస్ సాధించడం సులువు కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి.
బాలయ్య మినహా నందమూరి ఫ్యామిలీలో అలేఖ్యకు ఎవరి సపోర్ట్ లభించలేదు.తారకరత్న కుటుంబ సభ్యులు అలేఖ్యను అస్సలు పట్టించుకోలేదు.
అలేఖ్య బాధలను తట్టుకుని కెరీర్ పరంగా ముందడుగులు వేయాల్సి ఉంది.తారకరత్నకు సొంతంగా పలు వ్యాపారాలు ఉన్నాయని సమాచారం.
![Telugu Alekhya, Alekhya Reddy, Alekhyareddy, Ntr, Kalyan Ram, Nandamuri Fans-Mov Telugu Alekhya, Alekhya Reddy, Alekhyareddy, Ntr, Kalyan Ram, Nandamuri Fans-Mov](https://telugustop.com/wp-content/uploads/2023/03/details-here-goes-viral-in-social-media-Alekhya-politics.jpg)
ఆ వ్యాపారాలకు సంబంధించిన బాధ్యతలను చూసుకోవాల్సిన బాధ్యత అలేఖ్యపై ఉంది.అలేఖ్య రాజకీయాల్లో పోటీ చేయకుండా ఏదైనా పదవిని తీసుకుంటే బాగుంటుందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. వైసీపీకి వ్యతిరేకంగా అలేఖ్యా రెడ్డి కామెంట్లు చేయడం సాధ్యం కాదు.అలేఖ్యా రెడ్డికి ప్రజల్లో సానుభూతి ఉన్నా ఆ సానుభూతి ఓట్లుగా మారతాయని మాత్రం చెప్పలేము.
![Telugu Alekhya, Alekhya Reddy, Alekhyareddy, Ntr, Kalyan Ram, Nandamuri Fans-Mov Telugu Alekhya, Alekhya Reddy, Alekhyareddy, Ntr, Kalyan Ram, Nandamuri Fans-Mov](https://telugustop.com/wp-content/uploads/2023/03/nandamuri-fans-comments-about-alekhya-reddy-details.jpg)
నందమూరి మోహనకృష్ణకు అస్తులు ఇవ్వడం ఇష్టం లేదని ఆ రీజన్ వల్లే ఆయన ఈ విధంగా చేశారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.నందమూరి కుటుంబంలో ఉన్న విభేదాలను పరిష్కరించుకుంటే బాగుంటుందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.అలేఖ్యారెడ్డికి ప్రస్తుతం అన్ని విధాలా సపోర్ట్ అవసరమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.పిల్లల విషయంలో, ఆర్థికంగా, వ్యాపారాల పరంగా సమస్యలు రాకుండా అలేఖ్యారెడ్డికి నందమూరి కుటుంబం నుంచి జూనియర్ ఎన్టీఆర్ లేదా కళ్యాణ్ రామ్ సపోర్ట్ చేస్తే బాగుంటుందని మరి కొందరు చెబుతున్నారు.
అలేఖ్యకు తమ సపోర్ట్ ఎప్పటికీ ఉంటుందని నందమూరి అభిమానులు చెబుతున్నారు.