అర్థరాత్రి ఫోన్‌కు వచ్చిన ఆరు మిస్డ్‌ కాల్స్‌... ఆ తర్వాత రెండు కోట్ల రూపాయలు మాయం, కొత్త సంవత్సరంలో కొత్త తరహా దొంగతనం

టెక్నాలజీ పెరుగుతున్నా కొద్ది మోసగాళ్లు కొత్త తరహా మోసాలకు తెర లేపుతున్నారు.టెక్నాలజీని వాడుకుని బ్యాంకు ఖాతాల్లో ఉన్న డబ్బును దొబ్బేస్తున్నారు.

 Mumbai Businessman Loses Rs 1 86 Crore In Six Late Night Missed Calls-TeluguStop.com

ఇప్పటికే పలు రకాల టెక్నాలజీతో ఏటీఎం కార్డులను క్లోనింగ్‌ చేయడం, ఇంకా బ్యాంకు ఖాతా వివరాలను సేకరించి వాటి ద్వారా డబ్బును కాజేయడం చేస్తున్నారు.కాని కొత్త ఏడాది కొత్త తరహా చోరి జరిగి దేశ వ్యాప్తంగా సంచలనం అయ్యింది.

ఈ కొత్త తరహా దోపిడి విదేశాల్లో జరిగింది కాని, ఇండియాలో మాత్రం ఇదే ప్రథమం అంటున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళ్లే… ముంబాయికి చెందిన ఒక వ్యాపారవేత్త మొబైల్‌కు రాత్రి సమయంలో ఆరు మిస్డ్‌ కాల్స్‌ వచ్చాయి.

ఆ తర్వాత మొబైల్‌ సిమ్‌ పని చేయకుండా పోయింది.ఆరు సార్లు మిస్డ్‌ కాల్స్‌ ఇవ్వడం ద్వారా సిమ్‌ కార్డును స్వాప్‌ చేశారట.సిమ్‌ స్వాప్‌ చేయడం వల్ల కొత్త సిమ్‌ దుండగుల చేతికి చేరింది.అలా కొత్త సిమ్‌ను క్రియేట్‌ చేసి సదరు వ్యాపారికి చెందిన బ్యాంకు లావాదేవీలను చూశారు.

సదరు వ్యాపారి అకౌంట్‌లో దాదాపుగా రెండు కోట్ల వరకు డబ్బు ఉండటంను గమనించిన దుండగులు వెంటనే దాన్ని తమ వద్ద ఉన్న టెక్నాలజీతో తమ అకౌంట్స్‌లోకి ట్రాన్సపర్‌ చేసుకున్నారు.

మూడో కంటికి తెలియకుండా ఈ పని చేశారు.అయితే వ్యాపారి తన మొబైల్‌ నెంబర్‌ పని చేయడం లేదని గమనించి కొత్త సిమ్‌ తీసుకోగానే అసలు విషయం బయటకు వచ్చింది.వ్యాపారి ఖాతా నుండి ఆ రోజు రాత్రికి రాత్రే 14 అకౌంట్స్‌లోకి డబ్బు ట్రాన్సపర్‌ అయ్యింది.అయితే బ్యాంక్‌ సిబ్బంది వెంటనే స్పందించడంతో కొన్ని ఖాతాల నుండి డబ్బును వెనక్కు తీసుకు రాగలిగారు.

మొత్తంగా 20 లక్షల వరకు డబ్బు వెనక్కు రాగా మిగిలిన డబ్బు ఖాతాల నుండి డ్రా అయ్యింది.దాంతో ఇప్పుడు దుండగుల కోసం వెదికే పనిలో ఉన్నారు.

బాధితుడు కేసు పెట్టడంతో పోలీసులు ఎంక్వౌరీ చేస్తున్నారు.సైబర్‌ క్రైమ్‌ పోలీసులతో కలిసి జరుపుతున్న ఎంక్వౌరీలో త్వరలోనే ఆ దొంగలను పట్టుకుంటాం అంటూ ముంబయి పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.పెద్ద మొత్తంలో ఇలా చోరి కావడంతో వ్యాపారస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తమ ఫోన్‌లను జాగ్రత్తగా పెట్టుకోవడంతో పాటు, జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube