నటుడు జోజు జార్జ్ దర్శకుడిగా డెబ్యూ చిత్రం 'పణి' ఫస్ట్ లుక్ విడుదల !!! 

జోజు జార్జ్ ( Joju George ) ప్రతి ఒక్కరికి సుపరిచయమైన నటుడు.ఎన్నో చిత్రాల్లో మెమొరబుల్ రోల్స్ పోషించారు.

 Joju George Debut Movie As Director Pani First Look Poster Revealed , Pani Movie-TeluguStop.com

అద్భుతమైన నటన కనబరిచారు.నటుడిగా కొనసాగుతూనే జోజు జార్జ్ డెబ్యూ డైరెక్టర్ గా ‘పణి’( Pani Movie ) అనే చిత్రంతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు.

 పణి  చిత్ర యూనిట్ తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది.జోజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మాస్ కథాంశం, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ , రివేంజ్ డ్రామాగా అలరించబోతోంది. 

జోజు ఈ చిత్రానికి దర్శకుడు మాత్రమే కాదు.ఈ చిత్ర కథానాయకుడు కూడా ఆయనే.జోజు నుంచి చిత్రాలు కోరుకునే వారు ఈ ఫస్ట్ లుక్ తో( Pani Movie First Look ) సూపర్ హ్యాపీగా ఉన్నారు.అభినయ( Heroine Abhinaya ) ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

ఫస్ట్ లుక్ ఇప్పుడే రిలీజ్ చేశారు.మూవీ 100 రోజుల షూటింగ్ పూర్తయ్యాక థియేటర్స్ లోకి రానుంది.

ఈ చిత్రంలో బిగ్ బాస్ ఫేమ్ సాగర్, జునైస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

తన 28 ఏళ్ళ సినీ కెరీర్ లో జోజు తొలిసారి దర్శకత్వం వహిస్తున్నారు.

జోజు జూనియర్ ఆర్టిస్ట్ గా,  క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా నటించారు.ఇప్పుడు ఆయన పేరు ముందు డైరెక్టర్ అనే పదం చేరబోతోంది.

జోజు నటుడిగా కార్తీక్ సుబ్బరాజ్, సూర్య చిత్రంతో పాటు బాలీవుడ్ లో అనురాగ్ కశ్యప్ చిత్రంలో కూడా నటిస్తున్నాడు.పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న అనురాగ్ కశ్యప్ చిత్రాన్ని జోజు స్వయంగా నిర్మిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube