సబ్ కా సాత్.సబ్ కా వికాస్( sabka saath sabka vikas ) బీజేపీ లక్ష్యమని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి( Purandeswari ) అన్నారు.
కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవినీతి, వారసత్వ రహిత పాలన అందిస్తున్నారని పేర్కొన్నారు.
ఏపీని అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలబెట్టేందుకు బీజేపీ సహకరిస్తుందని తెలిపారు.సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లల్లో ఉండేలా మోదీ పాలన ఉందని కొనియాడారు.అయితే ఏపీలో ప్రస్తుతం బీజేపీ ముఖ్యనేతలు కీలక సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాంతో పాటు పొత్తులపై నేతలు చర్చిస్తున్నారు.