నాగార్జున నట వారసుడుగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన నటుడు అఖిల్ అక్కినేని.ఈ యంగ్ హీరో ఇప్పటి వరకు మూడు సినిమాలు చేసిన ఒకటి కూడా వర్క్ అవుట్ కాలేదు.
కమర్షియల్ హీరో అనిపించుకోవాలని తన ప్రయత్నంకి ఇప్పటి వరకు సరైన గుర్తింపు రాలేదు.చేసిన మూడు సినిమాలు కమర్షియల్ ఫార్మాట్ లోనే చేసిన ఏవీ కూడా వర్క్ అవుట్ కాకపోవడానికి కారణం కథ, కథనంలో ఉన్న లోపాలే అని చెప్పాలి.
రొటీన్ కథలకి కొత్తగా మసాలా అంటించి చేసిన ప్రయత్నాలు వృధా అయ్యాయి.ఈ నేపధ్యంలో ఈ సారి సరికొత్త ట్రెండింగ్ కథాంశంతో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాలో అఖిల్ కి జోడీగా పూజాహెగ్డే నటిస్తుంది.వరుస సక్సెస్ లతో ఉన్న హీరోయిన్ కావడంతో ఆమె క్రేజ్ ని ఈ సినిమా కోసం ఉపయోగించుకునే పనిలో చిత్ర నిర్మాతలు ఉన్నారు.
పేరుకే అఖిల్ హీరో అయినా కూడా పోస్టర్స్ లో పూజాహెగ్డేని హైలైట్ చేస్తున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమాతో ఎలా అయినా హిట్ కొట్టాలనే కసితో అఖిల్ ఉన్నాడు.

ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ సినిమా చేయబోతున్నాడు.పక్కా కమర్షియల్ కథాంశంతో ఈ సినిమా ఉండబోతుంది.ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కించే పనిలో ఉన్నారు.ఇక ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ ని ముగింపు దశకి సురేందర్ రెడ్డి తీసుకొచ్చేశాడు.
ఇక భారీ బడ్జెట్ తో తెరకెక్కే ఈ సినిమా కోసం ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయినా హీరోయిన్లు కాకుండా కొత్త అమ్మాయిని పరిచయం చేసే పనిలో దర్శకుడు ఉన్నట్లు తెలుస్తుంది.ఇందుకోసం ఇప్పటికే హీరోయిన్ ని ఎంపిక చేసినట్లు టాక్ వినిపిస్తుంది.
ప్రముఖ మోడల్ సాక్షి వైద్యని హీరోయిన్ గా ఖరారు చేసినట్లు తెలుస్తుంది.త్వరలో దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుందని టాక్.