ప్రస్తుత కాలంలో వివాహేతర సంబంధాల మోజులో పడి కొందరు వయసు, వావివరుసలు వంటివాటితో ఏమాత్రం సంబంధం లేనట్లు ప్రవర్తిస్తున్నారు.చివరికి కట్టుకున్న వారి చేతిలోనే కడతేరి పోతున్నారు.
కాగా తాజాగా ఓ పూజారి గుడిలో అర్చన చేసేటప్పుడు తనకు సహాయం గా ఉంటాడని అసిస్టెంట్ ని పెట్టుకోగా చివరికి ఆ అసిస్టెంట్ పూజారి భార్యని వలలో వేసుకుని కామ క్రీడలు సాగిస్తున్న విషయం తెలియడంతో పూజారి తన భార్యను దారుణంగా హతమార్చిన ఘటన తమిళనాడు రాష్ట్రంలో వెలుగు చూసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే గౌరమ్మ అనే వివాహిత తన కుటుంబ సభ్యులతో కలిసి కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు పరిసర ప్రాంతంలో నివాసముంటోంది.
అయితే గౌరమ్మ భర్త చెన్నబసప్ప కుటుంబ పోషణ నిమిత్తమై స్థానికంగా ఉన్నటువంటి ఓ ఆలయంలో ప్రధాన అర్చకుడిగా పని చేస్తున్నారు.ఈ మధ్య ఆలయంలో పనులు బాగా ఎక్కువ అవడంతో తెలిసిన వాళ్ళ ద్వారా 25 సంవత్సరాలు కలిగినటువంటి ఓ యువకుడిని అసిస్టెంట్ గా నియమించుకున్నాడు.
ఈ క్రమంలో అతడికి పూజలు, హోమాలు, అర్చనలు, ఎలా చేయాలనే విషయాలు కూడా నేర్పిస్తూ వస్తున్నాడు.దీంతో చెన్నబసప్ప తన అసిస్టెంట్ ని తన ఇంట్లోనే ఉండమని చెప్పి పక్క పోర్షన్ లో ఉన్నటువంటి ఓ గదిని ఇచ్చాడు.
ఈ క్రమంలో అసిస్టెంట్ చెన్నబసప్ప భార్య గౌరమ్మని వలలో వేసుకున్నాడు.దీంతో వీరిద్దరూ చెన్నబసప్ప ఇంట్లో లేని సమయంలో ఏకాంతంగా కలుసుకునేవారు.
తాజాగా ఈ విషయం చెన్నబసప్ప కి తెలియడంతో ఇద్దరిని పలుమార్లు మందలించి మరోమారు ఇలాంటి పనులు చేస్తే కఠినంగా శిక్షిస్తానని హెచ్చరించాడు.
![Telugu Assistant, Bangalore, Chenna Basappa, Gowramma, Karnataka, Brutallytamil, Telugu Assistant, Bangalore, Chenna Basappa, Gowramma, Karnataka, Brutallytamil,](https://telugustop.com/wp-content/uploads/2021/05/men-brutally-killed-the-her-wife-for-illegal-affairs-in-Tamil-Nadu.jpg )
అయినప్పటికీ గౌరమ్మ తన భర్త మాటలను పెడచెవిన పెట్టింది.దీంతో మరోమారు వీరిద్దరూ ఏకాంతంగా గడుపుతున్న సమయంలో చెన్నబసప్ప చూసాడు.దాంతో గౌరమ్మని చేతికందిన కత్తితో దారుణంగా హతమార్చాడు.
అనంతరం దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకున్న కారణంగా తన భార్యని తానే హతమార్చినట్లు పోలీసుల ముందు లొంగిపోయాడు.అయితే ఈ విషయం తెలుసుకున్న పూజారి అసిస్టెంట్ పరారీలో ఉన్నాడు.
దీంతో పోలీసులు పూజారి అసిస్టెంట్ కోసం గాలిస్తున్నారు.