హుజురాబాద్, గజ్వేల్( Huzurabad, Gajwel ) ఇలా రెండు నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందిన బిజెపి నేత ఈటెల రాజేందర్ ( Etela Rajender )ప్రభావం ఆ పార్టీలో బాగా తగ్గినట్టుగానే కనిపిస్తోంది.బిజెపిలో సీఎం అభ్యర్థిగాను రాజేందర్ పేరు ప్రచారం జరిగింది.
అయితే రెండు నియోజకవర్గాలను రాజేందర్ ఓటమి చెందడంతో ఆయన పరిస్థితి తలకిందులు అయినట్లుగా తయారయింది.బిజెపి ( BJP )అగ్ర నేతల దగ్గర ఉన్న పలుకుబడి బాగా తగ్గిపోయింది.
దీంతో రాజేందర్ పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని, కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉన్నట్లుగా కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది.అయితే ఈ ప్రచారాన్ని రాజేందర్ ఖండించారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిర్వహించిన సమావేశానికి సైతం రాజేందర్ హాజరయ్యారు.ఇది ఇలా ఉంటే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసేందుకు రాజేందర్ సిద్ధమవుతున్నారు.
ఇదే విషయాన్ని అమిత్ షా సమక్షంలోనే వెల్లడించారు.వచ్చే ఎన్నికల్లో తాను మల్కాజిగిరి నుంచే పోటీ చేస్తున్నట్లుగా రాజేందర్ ప్రకటించారు.
అయితే ఈ ప్రకటన బిజెపిలో ప్రకంపనాలు సృష్టించే అవకాశం కనిపిస్తోంది.
కరీంనగర్ సిట్టింగ్ ఎంపీగా బండి సంజయ్( Bandi Sanjay ) ఉన్నారు.ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందినా, మళ్లీ ఆయనకే ఎంపీ సీటు లభించే అవకాశం ఉంది.ఇక ఈటల రాజేందర్ తాను అసెంబ్లీకి రెండో స్థానంగా పోటీ చేసిన గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్న మెదక్ పార్లమెంట్ నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్లుగా అంతా భావించారు.
పార్టీలోనూ దీనిపై విస్తృతంగా ప్రచారం జరిగింది.అయితే అనూహ్యంగా ఈటెల రాజేందర్ మల్కాజిగిరి నుంచి పోటీ చేయబోతున్నట్లుగా ప్రకటించారు.
దీంతో ఆ నియోజకవర్గ బిజెపి నేతలు రాజేందర్( Rajender ) పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.రాజేందర్ కోరినట్లుగా మల్కాజిగిరి ఎంపీ టికెట్ ఇస్తుందా లేదా అనే విషయంలో ఇంకా ఏ క్లారిటీ లేదు.బిజెపి అధిష్టానం పెద్దలు దీనిపై ఎటువంటి హామీ రాజేందర్ కు ఇవ్వలేదు.దీంతో ఆ సీటు తనకు దక్కితే సరే, లేదంటే కాంగ్రెస్ లో చేరాలనే ఉద్దేశంలో రాజేందర్ ఉన్నట్టుగా అయన సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది.