విశాఖపట్నంలోని గాజువాక వైసీపీ సభలో గందరగోళం నెలకొంది.గాజువాక నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా ఊరుకుటి రామచంద్రరావును పార్టీ నియమించింది.
పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు ఊరుకుటి రామచంద్రరావు పేరును వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు.వైవీ సుబ్బారెడ్డి ప్రకటనతో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి వర్గం ఆందోళనకు దిగారు.
దీంతో తిప్పల నాగిరెడ్డి, ఊరుకుటి రామచంద్రరావు వర్గాల మధ్య తీవ్ర వాగ్వివాదం చెలరేగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఈ క్రమంలో సభ నుంచి వైవీ సుబ్బారెడ్డి మధ్యలోనే వెళ్లిపోయారని సమాచారం.







