ఏ హీరోకు అయినా 25వ చిత్రం అంటే చాలా ప్రత్యేకం.ఈమద్య కాలంలో హీరోలు 25 చిత్రాలు చేయడమే గగణంగా భావిస్తున్నారు.
అలాంటి సమయంలో మహేష్ బాబు 25వ చిత్రం అవ్వడంతో అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి.ఈ చిత్రం చాలా ఖరీదైన చిత్రంగా ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
దాదాపు సంవత్సరం పాటు దర్శకుడు ఈ చిత్రాన్ని తీర్చి దిద్దాడు.మరి ఈ చిత్రం ఎలా ఉంది, ఇంతగా కష్టపడ్డందుకు ఫలితం దక్కిందా, చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్ దక్కిందా అనేది ఈ రివ్యూలో చర్చిద్దాం.
నటీనటులు : మహేష్ బాబు, పూజా హెగ్డే, అల్లరి నరేష్, ప్రకాష్ రాజ్, జయసుధ, రావు రమేష్, జగపతిబాబు
దర్శకత్వం : వంశీ పైడిపల్లి
నిర్మాత : దిల్ రాజు, అశ్వినీదత్, పీవీపీ
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
కథ : తాను అనుకున్నది సాధించేందుకు ఎంత వరకు అయినా వెళ్లే తత్వం కలిగి ఉండే వ్యక్తి రిషి(మహేష్ బాబు).కాలేజ్ కుర్రాడిగా ఉన్న సమయంలో అతడు ఎదుర్కొన్న సంఘర్షణల నుండి ఒక ప్రపంచ స్థాయి కార్పోరేట్ కంపెనీకి అధినేత ఎలా ఎదిగాడు, అందుకు ప్రేరేపించిన కారణాలు ఏంటీ అనేది ఈ చిత్రం కథగా చెప్పుకోవచ్చు.
వేల కోట్లు సంపాదించిన రిషి వెనక్కు తిరిగి చూసుకుంటే జీవితంలో ఎన్నో మిస్ అవుతాడు.వాటిని మళ్లీ దక్కించుకునేందుకు తన స్నేహితుడి(అల్లరి నరేష్) ఊరు అయిన ఒక పల్లెటూరుకు వస్తాడు.
అక్కడ అతడు ఎదుర్కొన్న సవాళ్లు ఏంటీ అనేది సినిమాను చూసి తెలుసుకోంది.ఇదో విభిన్నమైన కథ అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం.
నటీనటుల నటన :
సూపర్ స్టార్ మహేష్ బాబు నటన గురించి ఇప్పుడు మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన పని లేదు.ఇప్పటికే 24 సినిమాల్లో హీరోగా నటించిన మహేష్ బాబు ఆయన నటనలో పండి పోయాడని చెప్పుకోవచ్చు.ప్రతి సీన్‌లో కూడా అద్బుతమైన ఎక్స్‌ప్రెషన్స్‌ను పలికించడంతో పాటు, ప్రతి ఫ్రేమ్‌లో కూడా మహేష్ కనిపించకుండా రిషి కనిపించేలా నటించాడు.ఇక హీరోయిన్ పూజా హెగ్డే కూడా చాలా బాగా నటించింది.
అందంతో పాటు అభినంతో ఈ అమ్మడు మెప్పించింది.మహేష్‌కు సరైన జోడీగా నిలిచింది.
ఇక అల్లరి నరేష్‌కు చాలా మంచి పాత్ర దక్కింది.స్క్రీన్ ప్రజెన్స్ కాస్త తక్కువ ఉన్నా కూడా ఉన్నంతలో అల్లరి నరేష్ మెప్పించాడు.ఇక ప్రకాష్ రాజ్, జయసుధ, రావు రమేష్, జగపతిబాబులు వారి పాత్రల పరిధిలో నటించి ఆకట్టుకున్నారు.
టెక్నికల్ :
సినిమా విడుదలకు ముందే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సక్సెస్ అయ్యింది.సినిమాలోని దాదాపు అన్ని పాటలు కూడా గత కొన్ని రోజులుగా మారుమ్రోగిపోతున్నాయి.ఇక సినిమాలో చిత్రీకరణ విషయంలో కూడా పాటలకు మరింత హంగులు అద్దారు.ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో కూడా దేవి దుమ్ము రేపాడు.కొన్ని సీన్స్‌కు దేవి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్‌గా నిలుస్తుందని చెప్పుకోవచ్చు.
సినిమాటోగ్రఫీ అద్బుతం.విదేశీ అందాలతో పాటు, పల్లె పచ్చదనంను కూడా సినిమాటోగ్రాఫర్ చక్కగా చూపించే ప్రయత్నం చేశాడు.
దర్శకుడు వంశీ పైడిపల్లి స్క్రీన్‌ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్తగా ఉండి, ఎంటర్‌టైన్‌మెంట్ విషయంలో వర్క్ చేసి ఉంటే బాగుండేది.దర్శకత్వం బాగానే ఉంది.
ఇక నిర్మాణాత్మక విలువల గురించి చెప్పనక్కర్లేదు.ప్రతి ఫ్రేమ్ కూడా చాలా రిచ్‌గా కథానుసారంగా సాగింది.
విశ్లేషణ :
మహేష్ బాబు 25వ సినిమా అంటూ గత రెండు సంవత్సరాలుగా ప్రేక్షకులు మరియు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో దిల్‌రాజు మాట్లాడుతూ మీరు ఎంత అయితే అంచనాలు పెట్టుకున్నారో అంతకు మించి ఈ చిత్రం ఉంటుందని చెప్పడంతో ఇక అంచనాలకు హద్దులు లేకుండా పోయాయి.ఈ చిత్రం 150 కోట్ల బిజినెస్ చేసింది అంటే సినిమాపై ఏ స్థాయిలో నమ్మకం ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అంచనాలకు తగ్గట్లుగానే ఈ చిత్రం ఉందని చెప్పుకోవచ్చు.
మహేష్ బాబు నుండి ఎలాంటి సినిమా అయితే ప్రేక్షకులు ఆశిస్తున్నారో అలాంటి సినిమా ఇది.ఒక అద్బుతమైన స్టోరీ లైన్ తో దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ చిత్రంను రూపొందించడం జరిగింది.చాలా విభిన్నమైన నేపథ్యం కాకున్నా కూడా రెగ్యులర్‌గా ఉన్నా స్క్రీన్‌ప్లే మాయాజాలంతో సినిమా స్థాయిని అమాంతం పెంచేశాడు.అయితే సినిమాలో ఇంకాస్త ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటే బాగుండేది.మహేష్ అభిమానులకు నచ్చే విధంగా సినిమా ఉంది.ప్రస్తుతం పోటీ లేని ఈ సమయంలో మహర్షి కలెక్షన్స్ తో కుమ్మేయడం ఖాయం.
ప్లస్ పాయింట్స్ :
మహేష్ బాబు స్టోరీ లైన్సినిమాటోగ్రఫీసంగీతంఅల్లరి నరేష్ పాత్ర
మైనస్ పాయింట్స్ :
ఎంటర్‌టైన్‌మెంట్ కాస్త తగ్గడం కొన్ని సీన్స్ బి,సి సెంటర్స్ వారికి కనెక్ట్ అయ్యేలా లేవు.
రేటింగ్ : 3.0/5.0
బోటం లైన్ : మహేష్ ఫ్యాన్స్‌కు బంపర్ బొనాంజ, ఆకట్టుకునే మహర్షి.