ఈసారి ఏకంగా ముగ్గురితో రొమాన్స్ చేయనున్న రష్మీ గౌతమ్ హీరో... 

గుంటూరు టాకీస్ చిత్రంలో టాలీవుడ్ హాట్ యాంకర్ రష్మి గౌతమ్ తో రెచ్చిపోయి రొమాన్స్ చేసినటువంటి హీరో సిద్దు జొన్నలగడ్డ అందరికీ బాగానే గుర్తు ఉంటాడు.అయితే ప్రస్తుతం సిద్దు జొన్నలగడ్డ “కృష్ణ అండ్ హిస్ లీల” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.

 Krishna And His Leela Sidhu Jonnagaddala-TeluguStop.com

ఈ చిత్రంలో హీరో సిద్ధూ సరసన సీరత్ కపూర్, షాలిని, జెర్సీ ఫేమ్ శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తున్నారు.ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు రవి కాంత్ పేరుపు దర్శకత్వం వహిస్తున్నాడు.

అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి నటువంటి 1.19 నిమిషాల నిడివిగల టీజర్ ని వాలెంటెన్స్ డే కానుకగా చిత్ర యూనిట్ సభ్యులు విడుదల చేశారు.ఈ టీజర్ ని ఒకసారి పరిశీలించినట్లయితే ఈ చిత్రంలో సిద్ధూ గుర్తు తెలియని వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.అంతేగాక సీరత్ కపూర్ తన అందాల ఆరబోతతో టీజర్ కి  మరింత అట్రాక్షన్ తెచ్చింది.

అయితే శ్రద్ధ శ్రీనాథ్ మాత్రం ట్రెడిషనల్ లూక్ లో కనిపించి ఆహా అనిపిస్తోంది.అయితే ఓవరల్ గా చూస్తే ఈ చిత్రం ట్రయాంగిల్ లవ్ స్టోరీ గా ఉన్నట్లు తెలుస్తోంది.

సిద్ధు జొన్నలగడ్డ తన మొదటి చిత్రంలో రొమాన్స్ తో ఆకట్టుకోగా మరి ఈ చిత్రంతో ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

Telugu Krishna Leela, Seerat Kapoor, Shalini, Siddhu Shraddha, Tollywood-Movie

అయితే ఈ చిత్ర ట్రైలర్ పై టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ తన అధికారిక ట్విట్టర్ ఖాతా స్పందించారు.ఇందులో భాగంగా బాగా పులిహోర కలపండి అమ్మా.! అన్నారు.

అలాగే చిత్ర యూనిట్ సభ్యులకి అభినందనలు తెలుపుతూ ప్రేక్షకుల వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube