యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం తన తాజా చిత్రం భీష్మను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు ముగించుకుని ఫిబ్రవరి 21న రిలీజ్ చేసేందుకు నితిన్ సిద్ధంగా ఉన్నాడు.
కాగా ఈ సినిమా తరువాత నితిన్ మరో సినిమాను కూడా లైన్‌లో పెట్టినట్లు తెలుస్తోంది.
నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి బాలీవుడ్‌లో సూపర్ సక్సెస్ సాధించిన అంధాధున్ చిత్ర రీమేక్ హక్కులను దక్కించుకున్నారు.
ఆ సినిమాను తెలుగులో ఆయనే ప్రొడ్యూస్ చేస్తూ రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నారు.బాలీవుడ్‌లో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించిన ఈ సినిమాలో హీరో ఓ గుడ్డివాడిగా కనిపిస్తాడు.
బాలీవుడ్ విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న ఈ సినిమాను తెలుగులో నితిన్ హీరోగా రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
కాగా ఈ సినిమాను మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.ఇక ప్రస్తుతం భీష్మ చిత్రాన్ని రిలీజ్‌కు రెడీ చేసిన నితిన్, తన నెక్ట్స్ మూవీ రంగ్‌దే షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.
ఈ సినిమా తరువాతే అంధాధున్ రీమేక్ పట్టాలెక్కే అవకాశం ఉందని చిత్ర వర్గాలు అంటున్నాయి.