మెగా హీరో మూవీ వస్తుంది అంటే సోషల్ మీడియాలో హడావుడి బాక్సాఫీస్ వద్ద గల గల.మీడియా వర్గాల్లో సందడి వాతావరణం.
ఫిల్మ్ నగర్ లో హడావుడి ఉంటుంది.ఉప్పెన వంటి సూపర్ హిట్ సినిమా తో పరిచయం అయిన మెగా హీరో వైష్ణవ్ తేజ్ సెకండ్ మూవీ కొండ పొలం విడుదలకు సిద్దం అయ్యింది.
ఈవారంలోనే మరో రెండు రోజుల్లోనే కొండ పొలం విడుదల కాబోతుంది.కాని ఇప్పటి వరకు సినిమా బజ్ భారీగా క్రియేట్ అయిన దాఖలాలు కనిపించడం లేదు.
అసలు ఈ సినిమాకు ఇంత తక్కువ బజ్ క్రియేట్ అవ్వడంకు కారణం ఏంటా అంటూ ఆశ్చర్య పోతున్నారు.అసలు ఏం జరిగింది అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే మరి కొందరు మాత్రం ఇలాంటి పబ్లిసిటీ స్టంట్ ఏంట్రా బాబు అంటున్నారు.
గత వారంలో విడుదల అయిన రిపబ్లిక్ మూవీకి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.కాని కొండ పొలం విషయంలో మాత్రం ఏమీ లేదు.ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక సింపుల్ గా జరిగింది.పెద్ద హీరో కాని ఇతరులు ఎవరైనా కాని కనిపించలేదు.
ఇక ప్రమోషన్ లో రకుల్ ఎక్కువగా కనిపించడం లేదు.

వైష్ణవ్ కూడా కొన్ని ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు.క్రిష్ మీడియాకు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉన్నాడు.సినిమాను ఎందుకు లో ప్రమోషన్స్ లో ఉంచుతున్నారు అనేది తెలియడం లేదు.
సోషల్ మీడియాలో కూడా కొండ పొలం గురించి అభిమానులు చర్చించుకునేలా ప్రత్యేక అంశాలను యూనిట్ సభ్యులు ఉంచడం లేదు.ఎందుకంటే ఈ సినిమాను భారీ అంచనాల నడుమ చూస్తే ఖచ్చితంగా నచ్చదు.
అందుకే సింపుల్ మైండ్.ఓపెన్ మైండ్ తో వెళ్తే తప్పకుండా నచ్చుతుంది అనే నమ్మకంను అంతా వ్యక్తం చేస్తున్నారు.
అందుకే క్రిష్ ఇలా ప్రమోషన్ ను ప్లాన్ చేశాడు అంటున్నారు.