తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy )పై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.గతంలో కేసీఆర్ అంటే నీళ్లు అనేలా ఉంటే.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కన్నీళ్లే మిగిలాయని విమర్శించారు.
మిషన్ భగీరథ( Mission Bhagiratha ) నిర్వహణ కూడా ప్రభుత్వానికి చేతకావడం లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు.ట్యాంకర్ల దందా జోరుగా సాగుతోందన్న ఆయన సాగు, తాగునీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.ఇది కాంగ్రెస్ సృష్టించిన కృత్రిమ కొరతని పేర్కొన్నారు.
ఈ క్రమంలో పార్టీ గేట్లు ఎత్తడం కాదు.ప్రాజెక్టుల గేట్లు ఎత్తండని చెప్పారు.
ఫోన్ ట్యాపింగ్ కాదు.వాటర్ ట్యాప్ లపై దృష్టి పెట్టండని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డికి రాజకీయాలు తప్ప ప్రజల సమస్యలు పట్టడం లేదని విమర్శించారు.కావాలనే కాళేశ్వరాన్ని విఫల ప్రాజెక్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.