కేసీఆర్ ఫ్యామిలీ ప్యాకేజ్ : అందరూ ఎంపీలు అవుదామనే .. ? 

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపు అన్ని స్థానాల్లో గెలిచి తీరాలనే పట్టుదలతో ఉంది బీఆర్ఎస్ పార్టీ( BRS party ).ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తామే గెలుస్తామని, మూడోసారి హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంటామని కెసిఆర్ ( KCR )అంచనా వేశారు.

 Kcr Family Package Will All Become Mps , Kcr, Ktr, Telangana, Brs Party, Telanga-TeluguStop.com

కానీ ఆ అంచనాలు తలకిందులు అయ్యాయి.బీఆర్ఎస్ ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది.

దీంతో పార్లమెంట్ స్థానాలపైనే బీఆర్ఎస్ ఫోకస్ చేసింది.ఇది ఇలా ఉంటే రాబోయే ఎన్నికల్లో కెసిఆర్ ఎంపీగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.

అసెంబ్లీలో అడుగు పెట్టకూడదని కంకణం కట్టుకున్నారు.ఇక కవిత( kavitha )నిజామాబాద్ నుంచి పోటీ చేయబోతున్నారు.

అయితే ఎమ్మెల్యేగా ఉన్న కేటీఆర్( ktr ) సైతం ఎంపీగా పోటీ చేసేందుకు నిర్ణయించుకున్నట్లు బీఆర్ఎస్ నుంచి మీడియాకు లీకులు వచ్చాయి.కేసిఆర్ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతిపక్ష నేతగా ఉండేందుకు ఇష్టపడడం లేదు.

అందుకే ఎంపీగా పోటీ చేస్తుండగా.కవితతో పాటు కేటీఆర్ కూడా ఎంపీగా పోటీకి దిగితే రాష్ట్రంలో పార్టీ బాధ్యతలు ఎవరు చూసుకుంటారు అనేది కూడా తేలాల్సి ఉంది.

Telugu Brs, Kavitha, Ktr Mp, Loksabha, Telangana, Telangana Cm-Politics

అసలు కేటీఆర్ ఎంపీగా ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు ? మీడియాకు ఎందుకు లీకులు ఇచ్చారు అనేది కూడా ఎవరికి అంతు పట్టడం లేదు.తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ బాధ్యతలను కేటీఆర్ చూసుకోవడంతో పాటు, అసెంబ్లీ లోను బీఆర్ఎస్ తరఫున గొంతు వినిపించడంలో కేటీఆర్ కీలకంగా ఉన్నారు.అటువంటిది కేటీఆర్ ఎంపీ గా పోటీ చేయడం వల్ల బీఆర్ ఎస్ కే నష్టం.

Telugu Brs, Kavitha, Ktr Mp, Loksabha, Telangana, Telangana Cm-Politics

కానీ ఆయన ఎంపీ గా పోటీ చేయబోతున్నట్లుగా లీకులు రావడం వెనుక కారణాలు ఏంటి అనేది ఎవరికీ అంతు పట్టడం లేదు.నిజామాబాద్ నుంచి కవిత ఎంపీగా బరిలో దిగుతున్నారు.మెదక్ నుంచి కేసీఆర్ పోటీ చేయడం ఖాయం అయింది.

అయితే కేటీఆర్ కూడా పోటీ చేస్తే ఆయన ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనేది క్లారిటీ రావాల్సి ఉంది.ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురూ ఎంపీలుగా పోటీ చేస్తే పార్టీ నాయకులలోనూ దీనిపై ఆగ్రహం వ్యక్తం అయ్యే అవకాశం లేకపోలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube