టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ గ్లామర్ నటి కాజల్ అగర్వాల్ గురించి అందరికీ తెలిసిందే.తన నటనతో, అందంతో అభిమానుల మనసులను దోచుకున్న ఈ ముద్దుగుమ్మ వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది.
కాజల్ అగర్వాల్ తన పెళ్లి తర్వాత తన రంగంలో లో మరింత బిజీగా మారింది.
గత ఏడాది అక్టోబర్ 30న ముంబైలో బిజినెస్ మాన్ గౌతమ్ కిచ్లూ కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
ఇక పెళ్లి తర్వాత కాజల్ అగర్వాల్ సినిమాల్లోకి వస్తుందా అన్న ప్రశ్నలు బాగా ఎదురయ్యాయి.కానీ పెళ్లి తర్వాతే తాను అసలు వ్యాపారాలను మొదలు పెడుతూ వరుస సినిమాలలో బాగా బిజీ గా మారింది.
కాజల్ అగర్వాల్ ఇటీవల కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టడంతో దాని గురించి కొన్ని విషయాలు పంచుకుంది.

ఇటీవలే ఇంగ్లీష్ వెబ్ సైట్ లో తాను ఇంటర్వ్యూలో పాల్గొన్న గా కొన్ని విషయాల గురించి మాట్లాడుతూ గత కొద్ది సంవత్సరాల నుంచి తన గురించి తాను వెతుక్కోవడం మొదలు పెట్టిందని, తన జీవితంలో మెడిటేషన్ పాత్ర ముఖ్యమైనదని, నీకు నీవుగా ఎస్టాబ్లిష్ కావడానికి మెడిటేషన్ వంటివి చాలా అవసరమని తెలిపింది.మైత్రేయ దాదాశ్రీ జీ బోధనలను కాజల్ అగర్వాల్ అనుసరిస్తుందట.ఇక ఆయన రాసిన పుస్తకం కాజల్ అగర్వాల్ ను బాగా ప్రభావితం చేసిందని తెలిపింది.

అంతేకాకుండా గౌతమ్ తో పెళ్లి తర్వాత తన జీవన విధానం మొత్తం మారిందంటూ, తను ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన భర్తతో కలిసి ఎక్కువ సమయం గడుపుతున్నానంటూ తెలిపింది.ఇక తమ ఇద్దరి పేర్లు కలిపి కిచ్ డ్ అనే ట్యాగ్ ట్రెండ్ కావడంతో ప్రస్తుతం అదే పేరుతో హిచ్ డ్ అనే పేరును తమ వ్యాపారానికి బ్రాండ్ గా మారిందని తెలిపింది.ఇక తమ వ్యాపారం హోమ్ డెకర్స్ తో ప్రారంభించగా అందులో కొత్తరకమైన ఉత్పత్తులను మార్కెట్లోకి అందిస్తున్నామని తెలిపింది.అంతేకాకుండా ఓ గేమింగ్ కంపెనీల్లో కూడా పెట్టుబడులు పెట్టగా, అందులో భారతీయ ఆటలను అందిస్తున్నామని తెలిపింది.