దాదాపు మూడు దశాబ్దాల క్రితం స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు రాధికా శరత్ కుమార్.అయితే సాధారణంగా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లు బుల్లితెర సీరియళ్లలో నటించడానికి పెద్దగా ఇష్టపడరు.
కానీ రాధికా శరత్ కుమార్ మాత్రం రాడాన్ పిక్చర్స్ ను స్థాపించి తెలుగు, తమిళ భాషల్లో సీరియళ్లను నిర్మించడంతో పాటు పలు సీరియళ్లలో నటిస్తున్నారు.
రాధిక నటించిన, నిర్మించిన సీరియళ్లలో మెజారిటీ సీరియళ్లు హిట్ కావడం గమనార్హం.
అయితే ఆమె ప్రస్తుతం తమిళంలో నటిస్తున్న చిట్టి 2 సీరియల్ నుంచి తప్పుకున్నారని సమాచారం.తెలుగులో బాగా ఇట్టైన పిన్ని సీరియల్ కు సీక్వెల్ చిట్టి 2.అయితే రాధిక శరత్ కుమార్ తప్పుకోవడానికి సీరియల్ టైమింగ్ మార్చడమే కారణమని తెలుస్తోంది.మొదట ఈ సీరియల్ రాత్రి 7 : 30 గంటల సమయంలో సన్ టీవీలో ప్రసారమయ్యేది.
అయితే కొన్ని కారణాల వల్ల ఈ సీరియల్ టైమింగ్ ను రాత్రి 10 గంటలకు మార్చారు.సీరియల్ టైమింగ్ మారడంతో రాధిక హర్ట్ కావడంతో పాటు సీరియల్ నుంచి తప్పుకున్నారని ప్రచారం జరుగుతోంది.
అయితే రాధిక సీరియల్ నుంచి తప్పుకోవడానికి అసలు కారణం మాత్రం తెలియాల్సి ఉంది.రాధిక తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పిన్ని 2 సీరియల్ నుంచి తప్పుకుంటున్నానని వెల్లడించడం గమనార్హం.
అయితే సీరియల్ నుంచి తప్పుకున్నా సీరియల్ ను మాత్రం ముందుకు తీసుకెళ్లాంటూ చెప్పారు.టెక్నీషియన్స్, సహనటులకు బై చెప్పాలంటే ఎంతో బాధగా ఉందని చాలా సంవత్సరాలుగా సన్ టీవీతో ట్రావెల్ అవుతూ వచ్చానని ఆమె అన్నారు.
రాధిక సీరియల్ నుంచి తప్పుకోవడంతో ఇప్పటివరకు మంచి రేటింగ్స్ సాధించిన చిట్టి 2 సీరియల్ ఇకపై మంచి రేటింగ్స్ సాధిస్తుందో లేదో చూడాల్సి ఉంది.