స్టార్ హీరోయిన్ సమంతతో గుణశేఖర్ శాకుంతలం మూవీని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.మహాభారతం మొదటి పర్వంలో ఉండే ప్రేమకావ్యం శాకుంతల దుష్యంతుడి కథకి గుణశేఖర్ దృశ్యరూపం ఇస్తున్నాడు.
పాన్ ఇండియా రేంజ్ లో ఈ మూవీని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.ఇదిలా ఉంటే ఈ మూవీని కంప్లీట్ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీలోనే ఆవిష్కరిస్తున్నారు.
ఇక మలయాళీ యాక్టర్ శాంతను ఈ మూవీలో దుష్యంతుడు పాత్రలో కనిపించబోతున్నాడు.ఇక మూవీలో శాకుంతల, దుష్యంతుడి ప్రేమకి గుర్తుగా పుట్టిన భరతుడు పాత్ర కోసం స్టార్ ఫేమ్ ఉన్న చైల్డ్ ఆర్టిస్ట్ ని తీసుకోవాలని గుణశేఖర్ భావిస్తున్నారు.
ఇందుకోసం ఎన్టీఆర్ కొడుకు అభయ్ అయితే బెటర్ అని అనుకుంటున్నట్లు సమాచారం.గుణశేఖర్ బాలల రామాయణం సినిమాతో తారక్ కి టాలీవుడ్ కి చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం చేశారు.

ఇప్పుడు అతని కొడుకుని కూడా శాకుంతలం మూవీ ద్వారా పరిచయం చేయాలని భావించి ఎన్టీఆర్ ని సంప్రదించినట్లు బోగట్టా.అతని నుంచి గ్రీన్ సిగ్నల్ రావడమే ఆలస్యం అని తెలుస్తుంది.ఇక వేళ ఎన్టీఆర్ కొడుకు కాదనుకుంటే అల్లు అర్జున్ తనయుడు అయాన్ ని అయిన భరతుడు పాత్ర కోసం తీసుకోవాలని భావిస్తున్నారు.వీరిద్దరిలో ఒకరిని కచ్చితం శాకుంతలం మూవీ కోసం గుణశేఖర్ ఫైనల్ చేయాలని ఛాయస్ గా పెట్టుకున్నట్లు బోగట్టా.
మరి గుణశేఖర్ ఆలోచనకి ఈ స్టార్ హీరోలు ఎంత వరకు సహకరిస్తారు అనేది చూడాలి.ఇదిలా ఉంటే శాకుంతలం షూటింగ్ ఇప్పటికే ప్రారంభమై మొదటి షెడ్యూల్ పూర్తయిందని తెలుస్తుంది.
లాక్ డౌన్ అనంతరం షూటింగ్స్ కి పర్మిషన్ ఇవ్వగానే నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు.