టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్.తన అందంతో బాగా రచ్చ చేస్తూ విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ అందుకుంది.ఒక్క సినిమాతోనే మంచి క్రేజ్ అందుకుంది.ఇక ఆ తర్వాత వరుస సినిమాలలో నటించగా అంత సక్సెస్ అందుకోలేకపోయింది.ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.తన పోస్టులతో యువతను బాగా పిచ్చెక్కిస్తుంది.
పంజాబీ సినిమా తో వెండితెరకు పరిచయమైన ఈ హాట్ బ్యూటీ ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది.ఇక హీరో కార్తికేయ నటించిన ఆర్ఎక్స్ 100 సినిమాలో తొలిసారిగా నటించగా ఓవర్ నైట్ స్టార్ గా మారింది.
దీంతో ఓ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్న బ్యూటీ తర్వాత అంత సక్సెస్ అందుకోలేకపోయింది.కానీ స్పెషల్ సాంగ్ లలో మెప్పించి మంచి గుర్తింపు అందుకుంది.ఇదిలా ఉంటే తాజాగా తనపై వచ్చిన పుకార్లకు గట్టిగా స్పందించింది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ 5 గురించి పలు ఏర్పాట్లు జరుగుతున్న సంగతి తెలిసిందే.ఇక జూమ్ ద్వారా కంటెస్టెంట్ లను ఎంపిక చేసుకుంటున్నట్లు తెలిసింది.ఇదిలా ఉంటే ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా త్వరత్వరగా సీజన్ 5 ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం.
ఇదిలా ఉంటే తాజాగా పాయల్ రాజ్ పుత్ ఎంపికైనట్లు తెగ వార్తలు వినిపించాయి.తను కూడా ఓకే చెప్పినట్లు కూడా తెలిసింది.

కానీ ఈ విషయం గురించి స్పందించిన పాయల్ నేను బిగ్ బాస్ లోకి రావడం ఏంటని ఇదంతా పుకారు మాత్రమేనని తను బిగ్ బాస్ 5 లోకి వెళ్లడం లేదని చెప్పింది.అంతేకాకుండా ఇలాంటి పుకార్లు లోకి అనవసరంగా తనను లాగవద్దని ఘాటుగా స్పందించింది.గతంలో కూడా నాగార్జున నటించిన బంగార్రాజు సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు జోరుగా ప్రచారం జరగడంతో ఇందులో ఎటువంటి నిజం లేదని పుకార్లను తోసిపుచ్చింది.