సుదీర్ఘకాలంగా తనతోనే ప్రయాణం .. సన్నిహితురాలికి కీలక పదవి కట్టబెట్టిన జో బైడెన్

వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్( Kamala Harris ) కార్యాలయంలో సీనియర్ సలహాదారుగా వున్న తనకు అత్యంత సన్నిహితురాలికి కీలక బాధ్యతలు కట్టబెట్టారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.( US President Joe Biden ) యునెస్కోలో అమెరికా రాయబారిగా ఆమెను నామినేట్ చేశారు జో బైడెన్.

 Joe Biden To Nominate Longtime Aide Courtney O Donnell To Become Us Ambassador T-TeluguStop.com

డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా వున్నప్పుడు యునెస్కో( UNESCO ) నుంచి అమెరికా తప్పుకుంది.అయితే ఐదేళ్ల తర్వాత ఇటీవలే యునెస్కోలో చేరింది.

ఈ క్రమంలోనే అమెరికా శాశ్వత ప్రతినిధిగా కోర్ట్నీ ఓ డొనెల్‌ను బైడెన్ నామినేట్ చేసినట్లు వైట్‌హౌస్ తెలిపింది.

ఓ డొనెల్( Courtney O’Donnell ) ప్రస్తుతం కమలా హారిస్ కార్యాలయంలో సీనియర్ సలహాదారుగా .వైస్ ప్రెసిడెంట్ భర్త డౌగ్ ఎమ్‌హాఫ్‌కు చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా‌నూ వ్యవహరిస్తున్నారు.లింగ సమానత్వం, పక్షపాతాన్ని ఎదుర్కోవడం, జాతీయ , ప్రపంచ స్థాయి అంశాలపై ఆమెకు విస్తృత అనుభవం వుంది.

జో బైడెన్ అమెరికా ఉపాధ్యక్షుడిగా వున్నప్పుడు జిల్ బైడెన్‌కు( Jill Biden ) కమ్యూనికేషన్స్ డైరెక్టర్‌గా వ్యవహరించారు.జిల్ బైడెన్ అమెరికా సైనిక కుటుంబాలకు అవగాహన , మద్ధతును పెంచడానికి , కమ్యూనిటీ కళాశాలలను ప్రోత్సహించడంలో ఓ డొన్నెల్ కీలక పాత్ర పోషించారు.

Telugu Donald Trump, Nerships, Jill Biden, Joe Biden, Joe Biden Close, Kamala Ha

గ్లోబల్ పార్ట్‌నర్‌షిప్‌లు, స్ట్రాటజిక్ కమ్యూనికేషన్‌లను అభివృద్ధి చేయడంలో ఆమెకు విస్తృతమైన అనుభవం వుంది.అధికారిక బయో ప్రకారం.ఇద్దరు అధ్యక్షుల హయాంలో ఓ డొన్నెల్ పనిచేశారు.దాతృత్వ సంస్థలు, జాతీయ రాజకీయ ప్రచారాలు, ప్రైవేట్ రంగంలో పలు సీనియర్ పదవులు ఆమె నిర్వర్తించారు.కొద్దిరోజుల క్రితం ‘‘Airbnb’’ సంస్థలో ఓ డొన్నెల్ గ్లోబల్ పార్ట్‌నర్‌షిప్‌లను( Global Partnerships ) పర్యవేక్షించారు.ఓ డొన్నెల్‌ను ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది విశ్వసిస్తున్నారని వైట్‌హౌస్ మాజీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ రాన్ క్లైన్ అన్నారు.

యునెస్కోలో అమెరికా ప్రతినిధిగా ఓ డొన్నెల్ నామినేషన్‌ను సెనేట్ ధ్రువీకరించాల్సి వుంది.

Telugu Donald Trump, Nerships, Jill Biden, Joe Biden, Joe Biden Close, Kamala Ha

ట్రంప్( Donald Trump ) హయాంలో వైదొలగిన తర్వాత.దాదాపు ఐదేళ్ల అనంతరం ఈ ఏడాది జూన్‌లో అమెరికా తిరిగి యునెస్కోలో చేరుతున్నట్లు ప్రకటించింది.యునెస్కోలోని 193 సభ్యదేశాలు .అమెరికా రీ ఎంట్రీని ఆమోదిస్తూ జూలైలో ఓటు వేసిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube