టాలీవుడ్ లో ఇస్మార్ట్ హీరోయిన్ అనగానే గుర్తొచ్చే హాట్ బ్యూటీ నిధి అగర్వాల్.తన అందంతో, నటనతో బాగా ఆకట్టుకుంది.
తెలుగు లోనే కాకుండా హిందీ లో కూడా పలు సినిమాలలో నటించింది.హీరోయిన్ గానే కాకుండా డాన్సర్ గా కూడా గుర్తింపు తెచ్చుకుంది.
ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టీవ్ గా ఉంటుంది.నిత్యం హాట్ ఫోటోలతో బాగా పిచ్చెక్కిస్తుంది.
తొలిసారిగా హిందీ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నిధి అగర్వాల్ ఆ తర్వాత సవ్యసాచి సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యింది.కానీ తొలి సినిమాతో అంత సక్సెస్ ను అందుకోలేదు.
ఇక ఆ తర్వాత మిస్టర్ మజ్ను సినిమాలో నటించగా ఈ సినిమా కూడా నిరాశ కలిగించింది.ఆ తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ లో హీరో రామ్ సరసన నటించి మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది.
పైగా తన గ్లామర్ ను కూడా బాగా పరిచయం చేసింది.
ఇక ఈ బ్యూటీ వరుస సినిమాలలో అవకాశాలు అందుకోగా.
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.ఇక ఈ సినిమాలో నిధి అగర్వాల్ స్ట్రాంగ్ పాత్రలో కనిపించనుందట.
పైగా అందులో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అని తెలుస్తుంది.ఈ సినిమాలో తను వీరమల్లును మోసం చేస్తుందని టాక్ వినిపిస్తుంది.
మొత్తానికి ఈ సినిమాతో స్టార్ హీరో సరసన నెగెటివ్ రోల్ లో తొలిసారిగా మెప్పించనుంది నిధి అగర్వాల్.

ఇక ఇటీవలే యంగ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ ల సరసన కూడా నటించే అవకాశాలు వస్తున్నాయని తెలుస్తోంది.ప్రస్తుతం ఈ స్టార్ హీరో ఇద్దరు కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమా తరువాత వీరిద్దరూ పలు సినిమాలలో అవకాశాలు అందుకోగా అందులో నిధి అగర్వాల్ ను ఎంపిక చేసుకున్నారని సమాచారం.