సోలోగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చి ఇండస్ట్రీ లో టాప్ హీరోగా గుర్తింపు పొందిన వాళ్లలో రవితేజ ( Raviteja )ఒకరు.ఈయన ఇండస్ట్రీ కి వచ్చిన మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా కొన్ని సినిమాలకి పని చేసి, ఆ తర్వాత కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసి మొదటిసారి నీకోసం అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యారు.
అయితే ఈ సినిమా తర్వాత ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం,( Itlu Sravani Subramanyam ) అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు వంటి సినిమాలు వచ్చినప్పటికీ రవితేజ కి మాత్రం మంచి ఇమేజ్ తెచ్చి పెట్టిన సినిమా ఇడియట్( Idiot ) అని చెప్పుకోవచ్చు.
ఈ సినిమాతో రవితేజ కి మాస్ మహారాజా అనే గుర్తింపు లభించింది.ఇక ఇడియట్ సినిమా ఇప్పటికీ టీవీలలో వస్తే చాలామంది జనాలు ఆసక్తిగా చూస్తారు.అయితే అలాంటి రవితేజ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ప్రస్తుతం మన ముందు మాస్ మహారాజా గా కొనసాగుతున్నారు.
ఈ మధ్యకాలంలో రవితేజ హీరోగా వచ్చిన ధమాకా( Dhamaka movie ) సినిమాతో మొదటిసారి 100 కోట్ల క్లబ్ లోకి చేరారు./br>ఇక ఇది ఇలా ఉంటే ఈ మధ్య రవితేజ కి సంభందించిన ఒక వార్త ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది అదేంటంటే ఆయన హీరో గా సినిమాలు చేస్తూనే అటు కొన్ని సినిమాలు కూడా డైరెక్షన్ చేయాలని చూస్తున్నాడు.
అయితే ఇంతకుముందు కూడా చాలా మంది హీరోలు మొదట సినిమా హీరోలు గా చేసి ఆ తర్వాత డైరెక్టర్లు గా మారారు అలాంటి వాళ్లలో సీనియర్ ఎన్టీయార్ ఒకరు ఆయన డైరెక్షన్ లోనే వచ్చిన దాన వీర శూర కర్ణ అనే సినిమా సూపర్ సక్సెస్ అయింది…ఇక ఆయనే కాకుండా సూపర్ స్టార్ కృష్ణ కూడా కొన్ని సినిమాలు డైరెక్షన్ చేసి మంచి సక్సెస్ లు అందుకున్నాడు…అయితే ఒక హీరో సినిమా ని డైరెక్షన్ చేయడం వల్ల ఆ సినిమా కూడా చాలా క్వాలిటీ గా వస్తుంది అని చాలా మంది ట్రేడ్ పండితులు కూడా అంటున్నారు…హీరోలానే డైరెక్షన్ లో కూడా రవితేజ సూపర్ సక్సెస్ కావాలని కోరుకుందాం…
.