భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగం అనేది లక్షల మందికి కలల గమ్యం.ఉద్యోగ భద్రత, పర్మినెంట్ జీతం, భవిష్యత్తు భద్రత వంటి అనేక కారణాలతో యువత ప్రభుత్వ రంగంలో ఉద్యోగాల కోసం సంవత్సరాల తరబడి కృషి చేస్తుంటారు.
కొందరికి అదృష్టం కలిసి వచ్చి ఉద్యోగం లభిస్తే, అది వారి జీవితంలో గమనాన్ని మార్చేస్తుంది.అయితే, కొన్ని సందర్భాల్లో అదే ప్రభుత్వ ఉద్యోగం వారికి శాపంగా మారే పరిస్థితులు ఏర్పడతాయి.
అలాంటి ఓ వాస్తవ సంఘటన హైదరాబాద్‌లో( Hyderabad ) చోటుచేసుకుంది.హైదరాబాద్‌కు చెందిన అమీన్ అహ్మద్ అన్సారీ( Amin Ahmed Ansari ) ప్రస్తుతం మెహిదీపట్నం ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా( Bus Conductor ) విధులు నిర్వర్తిస్తున్నారు.
మంచి జీతం, స్థిర ఉద్యోగం ఉండడంతో కుటుంబంలో అందరూ సంతోషంగా ఉన్నారు.కానీ, అహ్మద్ మాత్రం తన ఉద్యోగం వల్ల తీవ్రమైన శారీరక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఆ ఇబ్బందులకు కారణం ఉద్యోగ ఒత్తిడో, పైఅధికారుల ప్రవర్తనో కాదు.అహ్మద్ శరీర ఎత్తు.అవును అహ్మద్ ఎత్తు ఏకంగా 7 అడుగులు ఉండగా, బస్సులో నిల్చునే స్థలం ఎత్తు కేవలం 6 అడుగులు మాత్రమే.దీని వల్ల బస్సులో ఆయన నడవడానికి తలను వంచాల్సి వస్తోంది.
దీని వల్ల మెడ, వెన్నునొప్పులతో తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు.ఈ సందర్బంగా అహ్మద్ చెప్పిన వివరాల ప్రకారం, ఆయన రోజూ కనీసం 5 ట్రిప్పులు చేస్తారు.
ప్రతి ట్రిప్పు సుమారు 2 గంటల పాటు ఉంటుంది.అంటే రోజుకు దాదాపు 10 గంటల పాటు బస్సులో తల వంచి నిలబడాల్సిన పరిస్థితి.
ఇది ఆయన శరీరానికి తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తుంది.దీని వల్ల నిద్రలేమి, నెమ్మదిగా మెడ, వెన్నెముకల నొప్పులతో ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అహ్మద్ తండ్రి 2021 వరకు కాచిగూడ డిపోలో హెడ్ కానిస్టెబుల్‌గా పనిచేసేవారు.ఆయన మృతి తర్వాత కారణ్య మరణం కింద అహ్మద్‌కు కండక్టర్ ఉద్యోగం వచ్చింది.కానీ, ఇప్పుడు అదే ఉద్యోగం ఆయన ఆరోగ్యానికి సమస్యగా మారింది.అహ్మద్‌ను బస్సులో చూసిన ప్రయాణికులు ‘అయ్యో ఎంత కష్టంగా ఉంది’ అని సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాదు, ఇతనికి ఆర్టీసీలోనే ఎలాంటి కూర్చునే విధమైన, లేదా ఇతర విభాగంలో వదిలించదగిన ఉద్యోగం ఇవ్వాలని కోరుతున్నారు.ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే ఒకే కానీ., ఆ ఉద్యోగం మన ఆరోగ్యానికి, శారీరక సామర్ధ్యానికి అనుకూలంగా ఉండాలి.అహ్మద్ లాంటి ఉద్యోగులకు అవసరమైన మానవతా దృక్పథంతో సానుకూలంగా స్పందించి, వారిని మరింత అనుకూలమైన ఉద్యోగాల్లో నియమించడం ప్రభుత్వ బాధ్యత.
ఒక మంచి ఉద్యోగం ఒక్కరికే కాదు, వారి కుటుంబానికి కూడా జీవనాధారం అవుతుంది.కానీ అది శాపంగా మారకూడదన్నదే అందరిది ఆకాంక్ష.