నందమూరి నటసింహం గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు బాలయ్య బాబు ( Balayya Babu ) బోయపాటి శ్రీను ( Boyapati Srinu ) డైరెక్షన్ లో అఖండ 2 ( Akhanda 2 ) సినిమా చేస్తున్నాడు.ఇక ఇప్పటివరకు నాలుగు సక్సెస్ లతో భారీ విజయాలను అందుకున్న ఆయన రాబోతున్న సినిమాతో ఐదో సక్సెస్ ని కూడా తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.
తను అనుకున్నట్టుగానే ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.ఇక బోయపాటి బాలయ్య బాబు కాంబినేషన్ అంటే మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఇప్పటికే వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన మూడు సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ లను సాధించాయి.ఇక ఇప్పుడు రాబోతున్న అఖండ 2 సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంటుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఇక ఇలాంటి సందర్భంలోనే ఇక మీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.ఇక బోయపాటి ఈ సినిమా మీద తన పూర్తి ఫోకస్ ని పెట్టారట.

ఇంతకుముందు ఆయన చేసిన స్కంద సినిమా ఫ్లాప్ అవ్వడంతో బాలయ్య బాబు సినిమా మీద కొంతవరకు అంచనాలు తగ్గుతాయని అందరూ అనుకున్నప్పటికి బోయపాటి ఈ సినిమాని అనౌన్స్ చేసిన వెంటనే దీని మీద భారీ అంచనాలైతే పెట్టుకున్నారు.ఇక దానికి ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమాని తెరకెక్కించే పనిలో బోయపాటి ఉన్నట్టుగా తెలుస్తోంది…బాలయ్య బాబు మాస్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో కాబట్టి దాన్ని పూర్తిగా వాడుకోవాలనే ఉద్దేశ్యంలో బోయపాటి ఉన్నాడట.ఇక బోయపాటి ఏ రేంజ్ లో బాలయ్య బాబుని చూపిస్తాడు ఇంతకు ముందు వచ్చిన సినిమాలను మరిచిపోయేలా ఈ సినిమాలో బాలయ్య తన నట విశ్వరూపం చూపిస్తాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…
.