నాని( Nani ) గత చిత్రం దసరా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది.ఆ సినిమా పై చాలా నమ్మకం పెట్టుకున్న నానికి నిరాశే ఎదురు అయింది.
అయినా కూడా నాని తాజా చిత్రం హాయ్ నాన్న విషయం లో ఏమాత్రం ఛాన్స్ తీసుకోవడం లేదు.బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోవడమే లక్ష్యంగా హాయ్ నాన్న సినిమా( hi nanna movie ) కు ప్రమోషన్ చేస్తున్నాడు.
యానిమల్( Animal ) చిత్ర దర్శకుడు సందీప్ వంగ తో కలిసి తన సినిమా కు ప్రమోషన్ చేశాడు.ఇటీవల వెంకటేష్ తో కలిసి ఒక చిట్ చాట్ చేశాడు.
వెంకటేష్ సైంధవ్ సినిమా సంక్రాంతికి రాబోతున్న విషయం తెల్సిందే.ఆ సినిమా కు ప్రమోట్ చేయడం తో పాటు తన సినిమా ను కూడా నాని ప్రమోషన్ చేసుకున్నాడు.

ఇప్పుడు తేజ సజ్జ( teja sajja ) తో నాని చిట్ చాట్ చేశాడు.ఈ యువ హీరో సంక్రాంతికి హనుమాన్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.ఆ సినిమా గురించి విషయాలను అడిగి తెలుసుకుంటూ తన హాయ్ నాన్న సినిమా గురించి కూడా నాని చెబుతూ వచ్చాడు.మొత్తానికి నాని రాబోయే సినిమా ల మేకర్స్ తో మరియు హీరోలతో ఇలా చిట్ చాట్ చేస్తూ తన సినిమా కు ప్రమోట్ చేసుకోవడం కొత్తగా ఉందంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
నిజంగానే నాని కొత్త ట్రెండ్ కి తెర తీశాడు.ఇలాంటి ఇంటర్వ్యూలు మరియు చిట్ చాట్ లు అంటే ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తారు.

కనుక సినిమా కు మంచి పబ్లిసిటీ దక్కినట్లు అవుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.హాయ్ నాన్న సినిమా తో ఎలాగైనా పాన్ ఇండియా రేంజ్ లో విజయాన్ని సొంతం చేసుకోవాలనే ఉదేశ్యంతో నాని ప్రమోషన్ చేస్తున్నాడు.బెంగళూరు లో కూడా హాయ్ నాన్న కి మంచి బజ్ క్రియేట్ అయింది.కన్నడం లో ఈ సినిమా హిట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.